Jani Master: భార్య, పిల్లలతో జానీ మాస్టర్.. ‘యానిమల్’ మూవీ పాటతో ఎమోషనల్ వీడియో
ABN , Publish Date - Oct 26 , 2024 | 10:03 PM
37 రోజుల జైలు జీవితం అనంతరం జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇంటికి చేరుకున్నట్లుగా తెలుపుతూ ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో తన ఫ్యామిలీని హత్తుకుని.. ఎమోషనల్ అయ్యారు జానీ మాస్టర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
37 రోజుల జైలు జీవితం అనంతరం జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇంటికి చేరుకున్నట్లుగా తెలుపుతూ ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ఎమోషనల్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘యానిమల్’ సినిమాలోని ‘నాన్న’ సాంగ్ ప్లే అవుతుండగా.. జానీ మాస్టర్ తలుపుతట్టి ఇంట్లోకి వెళ్లడం, ఇద్దరూ పిల్లలు హత్తుకుని ఎమోషనల్ అవడం, ఆ తర్వాత భార్య హత్తుకోవడం, జానీ మాస్టర్ కళ్లలో నీళ్లు, భార్య వాటిని తుడవటం వంటి ఎమోషనల్ సన్నివేశాలున్న ఈ వీడియోని స్వయంగా జానీ మాస్టరే షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read-Nandamuri Balakrishna: తెలంగాణలో ‘బాలకృష్ణ ఫిలిం స్టూడియో’.. నిజమేనా?
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) శుక్రవారం హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 37 రోజుల తర్వాత చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ బెయిల్‌తో బయటికి వచ్చారు. జానీ మాస్టర్ జైలు నుంచి బయటికి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంటికి చేరుకున్న జానీ మాస్టర్ కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టుకున్నారు. భార్య, పిల్లలని హత్తుకుని, వారిపై ప్రేమ కురిపించారు.
‘‘37 రోజులు మనం జీవితంలో ఎన్ని విషయాలు మిస్సయ్యాయి. నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనలే నన్ను బయటికి తీసుకొచ్చాయి. కాస్త ఆలస్యమైనప్పటికీ కచ్చితంగా సత్యం ఏంటనేది తెలుస్తుంది. ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. ఇన్ని రోజులు నా కుటుంబం పడిన ఇబ్బంది మాత్రం నన్ను ఎప్పుడూ కలచివేస్తూనే ఉంటుంది..’’ అని జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియోతో పాటు పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జానీ మాస్టర్‌కు ధైర్యం చెబుతుంటే.. ఇంకొందరు ఇలాంటి పనులు చేయడం ఎందుకు అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు.