Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..

ABN , Publish Date - Sep 14 , 2024 | 06:04 PM

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు బ్లడ్‌ కేన్సర్‌‌తో బాధపడుతున్నట్లుగా, అతని చివరి కోరికగా చనిపోయే లోపు ‘దేవర’ సినిమాని చూడాలని కోరినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడా అభిమాని కోరిక తారక్ వరకు చేరింది. తన అభిమాని కోసం తారక్ ఏం చేశారంటే..

Jr NTR And His Fan Koushik

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) అభిమాని ఒకరు బ్లడ్‌ కేన్సర్‌‌తో బాధపడుతున్నట్లుగా, అతని చివరి కోరికగా చనిపోయే లోపు ‘దేవర’ సినిమాని చూడాలని కోరినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడా అభిమాని కోరిక తారక్ వరకు చేరింది. తన అభిమాని కోసం తారక్ దిగివచ్చి ధైర్యం చెప్పారు. టీటీడీలో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్‌ (19), 2022 నుంచీ బ్లడ్‌ కేన్సర్‌‌కు చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కౌశిక్ బెంగళూరులోని కిడ్‌వై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బోన్‌ మారో చికిత్సకు రూ.60 లక్షలకు పైగానే ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ‘‘అమ్మా.. నేను బతకనని తెలుసు. నా కోసం బాధపడకండి. ‘దేవర’ సినిమా విడుదల వరకూ బతికించండి చాలు.. నా చివరి కోరిక తీర్చండి’’ అని కౌశిక్‌ (Jr NTR Fan Koushik) కోరిన కోరికను.. ‘‘నా బిడ్డ జూనియర్‌ ఎన్టీయార్‌కు వీరాభిమాని. ‘దేవర’ సినిమా చూసి చచ్చిపోతా.. 27వ తేదీ వరకు బతికించండని వేడుకుంటున్నాడు. నా బిడ్డను బతికించండయ్యా’’ అంటూ ఆ యువకుడి తల్లి.. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా ముఖంగా తెలియజేసింది. కౌశిక్ తల్లి సరస్వతి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చివరికి తారక్ వరకు చేరాయి.

Also Read- Devara: ఎన్టీఆర్ డబ్బింగ్, జాన్వీ స్టయిలింగ్‌పై ట్రోలింగ్


అభిమాని కోసం తారక్ ఏం చేశారంటే..

అభిమాని కోరినట్లుగా తారక్ ‘దేవర’ సినిమాను ముందే వేసి చూపించలేదు కానీ.. తన అభిమానితో నేరుగా వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పి, సంతోషపరిచారు. ఎన్టీఆర్ ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ స్టేట్ కన్వినర్ కృష్ణ యాదవ్.. ఎన్టీఆర్ అభిమాని ఉన్న బెంగళూరు హాస్పిటల్‌కు చేరుకుని కౌశిక్‌ను, అతని ఫ్యామిలీని పరామర్శించారు. అనంతరం కౌశిక్ కోరిక మేరకు ఎన్టీఆర్‌తో దాదాపు 10 నిమిషాలు వీడియో కాల్ మాట్లాడించారు. ఈ కాల్‌లో కౌశిక్‌కు ధైర్యం చెప్పిన ఎన్టీఆర్.. అనంతరం కౌశిక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్లు మాణిక్యం, బసవలకు కౌశిక్ విషయంలో తగు సూచనలు చేసినట్లుగా సమాచారం.


తారక్‌పై ప్రశంసలు

అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి గతంలో కూడా ఓసారి ఇలానే ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి.. అభిమానిని ఆనందపరిచారు. ఇప్పుడు కౌశిక్ విషయంలో కూడా వెంటనే స్పందించి, అతని ఆరోగ్యం మెరుగుపడేందుకు నేనున్నా నంటూ ధైర్యం ఇచ్చిన ఎన్టీఆర్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 14 , 2024 | 06:04 PM