Maadhavi Latha: అల్లు అర్జున్ తప్పే చేశాడు.. నేరం కాదు... సీఎం రేవంత్ రెడ్డిపై మాధవీ లత ఫైర్

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:25 PM

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల భేటీపై ‘నచ్చావులే’ హీరోయిన్ మాధవీ లత సంచలన కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ.. ఆమె విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె ఏం చెప్పుకొచ్చిందంటే..

Maadhavi Latha and CM Revanth Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ‘నచ్చావులే’ హీరోయిన్. బీజేపీ నాయకురాలు మాధవీ లత సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ విషయంలో ఈ గలీజ్ పనులేంటి? అని ఆమె ప్రశ్నించింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ విషయంపై అలాగే, సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడుతూ.. మాధవీ లత ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆమె సీఎం రేవంత్ రెడ్డి‌కి కొన్ని ప్రశ్నలు సంధించింది. మరీ ముఖ్యంగా జగన్‌తో సీఎం రేవంత్ రెడ్డిని పోల్చుతూ.. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మాధవీ లత ఈ వీడియోలో ఏమందంటే..

Also Read- Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..


‘‘సీఎం రేవంత్ రెడ్డి సార్‌ని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నాను.. చాలా మంది అడిగినవే నేనూ అడుగుతున్నాను. కాకపోతే కాస్త ఆలస్యమైంది అంతే. నిన్న మెదక్ జిల్లాలో ఒక చిన్నపాపపై అత్యాచారం జరిగింది. దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ, అక్బరుద్దీన్లు.. అబ్బాస్ తప్పు చేశాడు.. శిక్ష విధించండి.. దీనిపై ఏమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతారా? కొడంగల్‌లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుని.. దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే అని చెప్పి, లేఖ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడంట. మరి వాళ్ల కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చారా? పోనీ పాతిక వేలైనా ఎవరైనా ఇచ్చారా? ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట.. పొద్దు తిరుగుడు పువ్వు అంట. మరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులని పరామర్శించి డబ్బులు ఇచ్చారా?


హీరో అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, అది ఆయనకి తెలియకుండా జరిగింది. దానిపై సరిగా స్పందించకపోవడమే అల్లు అర్జున్ చేసిన పొరపాటు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంటుంది. అందరిలా ఆయన కూడా సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి విధులు, హక్కులు వర్తిస్తాయో.. ఆయనకీ వర్తిస్తాయి. జరిగిన చిన్న తప్పుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలని, సినిమా ఇండస్ట్రీని కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారు. ఎలా అయితే జగన్ సినిమా వాళ్లందరినీ పిలిపించుకొని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నాడో.. మనం కూడా సీఎం అయ్యాక ఎందుకు చేయించుకోకూడదు అని రేవంత్ రెడ్డి భావించినట్లున్నాడు.


రేవంత్ రెడ్డి గారు మీ ప్రయాణం చాలా బాగుంది. ఫస్ట్ నుండి మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. ఈరోజు సీఎం అయ్యారు. జీవితంలో చాలా సాధించారు. మరి ఎందుకిప్పుడు? ఇలా బిహేవ్ చేస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది చనిపోయారు.. ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. డైరెక్ట్‌గా బాధితులకు స్పందించకుండా.. అందరికీ సమానంగా స్పందించండి. సినిమా వాళ్ల మీద దిల్ రాజును అడ్డు పెట్టుకుని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. సినిమా వాళ్ల బతుకులు అలాంటివి.. వచ్చి మీ కాళ్లు మొక్కుతారు’’ అంటూ మాధవీ లత ఈ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 27 , 2024 | 05:04 PM