Mohan Babu and Vishnu: ఏపీ సీఎంను కలిసిన మంచు మోహన్ బాబు, విష్ణు.. విషయం ఏమిటంటే

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:33 PM

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. సీఎం చంద్రబాబుతో మోహన్ బాబు కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీ వెనుక కారణం ఏమిటంటే..

Manchu Mohan Babu and Manchu Vishnu

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదలకు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. అలాంటి వారందరికీ ఆహారం అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేసి సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశాయి. ఏపీలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ నగరాల్లో గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. విజయవాడ నగరంలోని సింగ్ నగర్, మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీ తదితర ప్రాంతాలు జలదిగ్భంధం అయిన విషయం తెలిసిందే. ఈ వరదలకు బాధితులైన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎందరో నటులు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారు. తాజాగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మంచు ఫ్యామిలీ తరపున రూ. 25 లక్షల విరాళాన్ని అందజేశారు మంచు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మంచు విష్ణు.

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)ని మర్యాదపూర్వంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కుని కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు (Mohan Babu), విష్ణు మంచు (Manchu Vishnu) అందజేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షల విరాళాన్ని మోహన్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ చెక్కుని అందజేసేందుకు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం చంద్రబాబుతో మోహన్ బాబు కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం చెక్కుని అందించి.. ఆపత్కాల సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడిన విధానాన్ని కొనియాడారు.


CM-Chandrababu.jpg

మోహన్ బాబు, మంచు విష్ణు సినిమాల విషయానికి వస్తే.. మోహన్ బాబు నిర్మాతగా మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్‌తో ‘కన్నప్ప’ అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా, మోహన్ బాబు కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2024 | 04:45 PM