Mega vs Allu: ఈ మంట చల్లారెదెప్పుడో?

ABN , Publish Date - Aug 10 , 2024 | 10:58 AM

మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదాలు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఆ ఫ్యామిలీలకు సన్నిహితులైన కొందరు ఏ పొరపొచ్చాలు లేవంటూ క్లారిటీ ఇస్తున్నప్పటికీ.. ఏదో రకంగా వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కామెంట్స్‌ని సగం సగం వీడియోలు చూసి అల్లు అర్జున్‌కు ఆపాదించి మరీ సోషల్ మీడియాలో రచ్చ జరగటం చూస్తుంటే ఈ గ్యాప్ ఇప్పట్లో ఫిల్ అయ్యే అవకాశం అస్సలు కనిపించటం లేదు.

Pawan Kalyan and Allu Arjun

మెగా, అల్లు కుటుంబాల (Mega and Allu Families) మధ్య వివాదాలు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఆ ఫ్యామిలీలకు సన్నిహితులైన వారు.. వారి మధ్య ఏ పొరపొచ్చాలు లేవంటూ క్లారిటీ ఇస్తున్నప్పటికీ.. ఏదో రకంగా వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఇరు కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య వివాదాలంటూ అనేక పుకార్లు షికార్లు చేయటం, వాటిని ఖండించటం ఇప్పుడు కామనైపోయింది. సోషల్ మీడియాలో అయితే మెగా వర్సెస్ అల్లు (Mega Vs Allu) అన్నట్లుగా పెద్ద యుద్ధమే జరుగుతుంది.

Also Read- Sobhita Dhulipala: పరిచయం ఎలా మొదలైనా.. హృదయాలు కలిసిపోయాయ్! శోభిత పోస్ట్ వైరల్

మరీ ముఖ్యంగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారం ఈ రెండు ఫ్యామిలీల మధ్య పెద్ద చిచ్చుకు కారణమైందనేలా టాక్ మొదటి నుంచి వినబడుతోంది. అంతకు ముందు ఎన్ని వివాదాలు ఉన్నా.. ఎన్నికల వేళ అల్లు అర్జున్ చేసిన ఒక్క పని.. మెగా ఫ్యామిలీ (Mega Family)ని బాగా హర్ట్ చేసింది. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun) తన భార్య ఫ్రెండ్ భర్తకు చేసిన స్నేహపూర్వకమైన సపోర్ట్ మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ స‌భ్యులను కూడా ఇబ్బంది పెట్టిందనే వార్తలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. దీనిపై అటు మెగా కుటుంబ సభ్యులైన నాగబాబు, నిహారిక.. ఇటు అల్లు కుటుంబానికి ఆప్తుడైన బన్నీ వాస్ లాంటి వారు ‌పలు సందర్భాలలో స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిదని ఒకరంటే.. గ్యాప్ ఫిల్ అయ్యే మూమెంట్ ఒకటి వస్తే చాలని మరొకరు మాట్లాడారు. ఇలా నడుస్తున్న ఈ కాంట్రవర్సీలోకి బెంగళూర్ వేదికగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన కామెంట్స్ ఈ కాంట్రవర్సీకి మరింత ఆజ్యం పోసినట్లయ్యాయి. (War Between Mega and Allu Fans)


Mega-vs-Allu.jpg

ఆయన క్యాజువల్‌గా అన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌ని సగం సగం వీడియోలు చూసి అల్లు అర్జున్‌కు ఆపాదించి మరీ సోషల్ మీడియాలో రచ్చ జరగటం చూస్తుంటే గ్యాప్ ఇప్పట్లో ఫిల్ అయ్యే అవకాశం అస్సలు కనిపించటం లేదు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కర్నాటక ప్రభుత్వంతో కలిసి చర్చలు జరిపిన పవన్ కల్యాణ్, ఆ క్రమంలో కల్చరల్ షిఫ్ట్ గురించి చెబుతూ..‌ సినిమాలు, అందులో హీరోల పాత్రలను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు అడవులను హీరో రక్షిస్తే.. ఇప్పుడు హీరోలే అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా సినిమాలు ఉంటున్నాయని పవన్ కళ్యాణ్ క్యాజువల్‌గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమా కల్చర్ అలా మారిందని చెప్పడం ఆయన ఉద్దేశం. తర్వాత ఆయన ఒక సినిమా వాడిగా క్లారిటీ కూడా ఇచ్చారు. తను ఉన్నా కూడా అలాంటి పరిస్థితే ఉంటుందని వివరంగా చెబితే.. ముందు చెప్పిన వర్డ్స్‌ని కట్ చేసి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో నెగిటివ్ కోణంలో వైరల్ చేస్తున్నారు.

Also Read- NTR: ఎన్టీఆర్ పేరుతో మరో వారసుడు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్

మరీ ముఖ్యంగా పవన్ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ని (Pawan Kalyan vs Allu Arjun) ఉద్దేశించే అనేలా ప్రొజక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే, ‘పుష్ప’ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నటించి ఉన్నారు. దీంతో అల్లు ఫ్యాన్స్, అల్లు ఆర్మీ (Allu Army) పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. పూర్తి వీడియో చూడండి అంటూ గట్టిగానే బదులిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అన్నట్లుగా ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయి మరీ మాటల దాడులకు పాల్పడుతున్నారు. నిజానికి ఎన్నికల సమయం నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఓ రాజకీయ పార్టీ (Political Party) విపరీతమైన నెగిటివ్ ప్రచారానికి తెగబడుతోందని వార్తలు వినిపించడమే కాదు.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ తెలుస్తూనే ఉంది.

Read Latest Cinema News

ఇదిలా ఉంటే.. కొన్నాళ్ళు నిశ్చబ్దంగా ఉంటే అన్నీ సమస్యలు, అభిప్రాయ భేదాలు తొలగిపొతాయనే ధోరణి మెగా, అల్లు కుటుంబ సభ్యుల్లో ఉన్నా.. సోషల్ మీడియా సమాజం దానిని ఒప్పుకునేలా లేదు.. ఏదో రకంగా ఆ ఫ్యామిలీలో మంటలు పెట్టి చలికాచుకోవాలని చూసే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇది ఆ రెండు ఫ్యామిలీలు ఎప్పుడు అర్థం చేసుకుంటాయో.. ఆ ఫ్యామిలీల మధ్య ఈ మంటలు చల్లారెదెప్పుడో చూడాలి మరి!

Updated Date - Aug 10 , 2024 | 10:58 AM