Megastar Chiranjeevi: ప్రభుత్వ లక్ష్యం అదే.. మార్పు తీసుకురండి!

ABN , Publish Date - Jun 28 , 2024 | 06:26 PM

మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ వాడుతున్నా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ చేస్తున్నట్లయితే, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండని కోరారు పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ సిఎమ్ఓ నేతృత్వంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చిరంజీవి భాగమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియోను, అలాగే ఓ మెసేజ్‌ను ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

Megastar Chiranjeevi: ప్రభుత్వ లక్ష్యం అదే.. మార్పు తీసుకురండి!
Chiranjeevi and Teja Sajja

మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ వాడుతున్నా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ చేస్తున్నట్లయితే, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండని కోరారు పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). తెలంగాణ సిఎమ్ఓ నేతృత్వంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చిరంజీవి భాగమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియోను, అలాగే ఓ మెసేజ్‌ను ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

‘‘TelanganaCMO నేతృత్వంలోని ఈ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను హైలైట్ చేసే శక్తివంతమైన వీడియో ఇది. మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ వాడుతున్నా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ చేస్తున్నట్లయితే, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండి. కాల్ 📞 87126 71111. మీ వివరాలు గోప్యంగా వుంచబడతాయి. ప్రాణాలు కాపాడడంలో సహాయం చేయండి! బాధితులను వ్యసనాల నుండి విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప వారిని శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధించేందుకు నాతో పాటు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)తో చేతులు కలపండి. ఈ సందేశాన్ని అందరికీ తెలియజేయండి. మార్పు తీసుకురండి!’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. (Anti Drug Day Awareness Program)


Chiranjeevi.jpg

అలాగే మెగాస్టార్ షేర్ చేసిన వీడియోలో కూడా ఓ మంచి మెసేజ్‌ని ఇచ్చారు. డ్రగ్స్ వాడకం వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో.. ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ డ్రగ్స్ కారణంగా యువత ఏ విధంగా చెడు దోవ పడుతుంది.. తద్వారా వారి కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయనేది ఈ లఘు చిత్రంలో చాలా చక్కగా చూపించారు. మరి మెగాస్టార్ పిలుపునిచ్చారు.. ఆయన అభిమానులు డ్యూటీ ఎక్కేస్తారా? చూద్దాం.

ఇదిలా ఉండగా.. యాంటీ డ్రగ్ డే ఎవర్నెస్ కార్యక్రమాన్ని (Anti Drug Day Awareness Program) పురస్కరించుకుని.. తెలంగాణ పోలీసులు ఈసారి యూత్ హీరో తేజ సజ్జా (Teja Sajja)ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. ఈ కార్యక్రమంలో తేజ సజ్జా కూడా యూత్‌ని ఆకర్షించేలా మాట్లాడి.. అందరినీ అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Updated Date - Jun 28 , 2024 | 06:26 PM