Chiranjeevi: సీఎం చంద్రబాబుని కలిసిన చిరంజీవి.. విషయమిదే
ABN , Publish Date - Oct 12 , 2024 | 07:19 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్‌తో కలిసి ప్రకటించిన కోటి రూపాయల చెక్‌లను మెగాస్టార్ చిరంజీవి అందజేశారు. ఈ చెక్‌లను ఇచ్చేందుకు స్వయంగా ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu)ని కలిసి వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి ప్రకటించిన కోటి రూపాయల చెక్‌లను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శనివారం హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తమ వంతుగా ప్రభుత్వానికి మద్ధతుని ప్రకటిస్తూ విరాళాలను అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విరాళం ప్రకటించిన చాలా మంది సెలబ్రిటీలు నేరుగా సీఎం చంద్రబాబుని కలిసి విరాళాలు అందజేశారు. ఇప్పుడు మెగాస్టార్ వంతొచ్చింది.
Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి సినీ పరిశ్రమ నుంచి తన వంతు మద్దతుని చిరంజీవి అండ్ ఫ్యామిలీ తెలియచేస్తుంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి తెలుగు రాష్ట్రాలకు (ఏపీ, తెలంగాణ) తలో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా చంద్రబాబు నాయుడుని కలిసిన చిరంజీవి తన యాభై లక్షల రూపాయల చెక్‌తో పాటు, రామ్ చరణ్ ప్రకటించిన యాభై లక్షల రూపాయల చెక్‌ను.. మొత్తంగా కోటి రూపాయల చెక్‌లను అందజేశారు.
Also Read- Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ రివ్యూ
వరదల సహాయార్థం ప్రకటించిన విరాళాన్ని అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సీఎం చంద్రబాబునాయుడు సాదర స్వాగతం పలికారు. కష్ట సమయంలో అండగా నిలబడిన చిరంజీవి, రామ్ చరణ్‌లకు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఎప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మేమున్నామంటూ ముందుకొచ్చి సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తెలుపుతూ.. మెగాస్టార్‌ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ మీట్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.