RP Patnaik: కొడుకుపై ర్యాగింగ్.. పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:46 PM

రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు చేశారు. తన కొడుకు వైష్ణవ్‌ని ర్యాగింగ్ చేస్తూ చెవి కొరికినట్లుగా శ్యామ్ అనే విద్యార్థిపై ఆయన ఫిర్యాదు చేశారు. విషయంలోకి వస్తే..

Music Director RP Patnaik

రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) ఫిర్యాదు చేశారు. తన కొడుకు వైష్ణవ్‌ (Vaishnav)ని ర్యాగింగ్ చేస్తూ చెవి కొరికినట్లుగా శ్యామ్ అనే విద్యార్థిపై ఆయన ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న ఆర్పీ పట్నాయక్ తనయుడు వైష్ణవ్‌పై అదే కాలేజీలో చదువుతున్న సీనియర్ విద్యార్థి శ్యామ్ ర్యాగింగ్ చేయడమే కాకుండా.. బస్సులో వెళ్లేటప్పుడు వైష్ణవ్‌తో గొడవకు దిగాడని తెలుస్తోంది.

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

ఈ గొడవలో ఆవేశానికి లోనైన శ్యామ్.. ఆర్పీ పట్నాయక్ కుమారుడైన వైష్ణవ్ చెవి కొరికి.. వైష్ణవ్‌వి తీవ్రంగా గాయపరిచాడు. తన కుమారుడిపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న ఆర్పీ పట్నాయక్ వెంటనే శ్యామ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి ఆర్పీ పట్నాయక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.


RP-Patnaik-Music.jpg

ఆర్పీ పట్నాయక్ విషయానికి వస్తే.. ఒకప్పుడు టాప్ సంగీత దర్శకుడిగా దూసుకెళ్లిన ఆర్పీ పట్నాయక్ ఆ తర్వాత కొంతకాలం దర్శకుడిగానూ తన ప్రతిభను కనబరిచారు. ప్రస్తుతం దర్శకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాగే హీరోగానూ కొన్ని మెమరబుల్ సినిమాలలో ఆయన నటించారు.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..


Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 04:07 PM