Singer Smitha: సింగర్ స్మిత 'ఓల్డ్ స్కూల్ బృందావనం' ప్రారంభం

ABN , Publish Date - Jul 30 , 2024 | 05:49 PM

నటి, సింగర్, బిజినెస్ వుమన్ అయిన స్మిత ఇప్పుడు ఇంకో బిజినెస్ వెంచర్ మొదలెట్టారు. సాంప్రదాయలకి అనుగుణంగా ఆధునిక పద్దతిలో చర్మ సౌందర్యానికి, ముఖ వర్చస్సుకు, ఆర్గానిక్ లిక్విడ్స్, పౌడర్లు తయారు చేశారు. ఇందులో వెల్ నెస్ సెంటర్ కూడా వుంది, ఇలాంటిది హైదరాబాదులో ఇదే మొదటిది.

Singer Smitha

పాప్ సింగర్ స్మిత తెలియని తెలుగువారు వుండరు. కొన్ని సినిమాలలో నటించి, ఇటు తన పాటలతో, అటు వ్యాపారాలతో తనదైన శైలిలో ముందుకు వెళుతున్న స్మిత ఈసారి ఇంకొక కొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు కేవలం పాటలు, వ్యాపారాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. అందులో భాగంగానే 'ఓల్డ్ స్కూల్ బృందావనం' ప్రారంభించారు. (Singer Smitha launches Old School Brindavanam in Hyderabad)

ఓల్డ్ స్కూల్ బృందావనం నేచురల్, క్లీన్, అలాగే ప్రకృతి వైద్య చికిత్సల కోసం క్రిస్టల్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ వంటి వాటితో చర్మ సౌందర్యానికి, ఆరోగ్య రక్షణకి పనికివచ్చే విధంగా కొన్ని పౌడర్లు, లిక్విడ్స్ తయారుచేసి స్మిత అందిస్తున్నారు. వాటితో పాటుగా వెల్ నెస్ సెంటర్ కూడా లాంచ్ చేసి అందులో థెరపీ కూడా చేస్తున్నారు. చర్మ సౌందర్యానికి పనికొచ్చే కొన్ని రకాలైన ఆర్గానిక్ దినుసులతో పౌడర్, లిక్విడ్ తయారు చేశారు. వాటిలో కొన్ని రకాలైన పువ్వులు, ఆకులు, కొన్ని కూరగాయలు నుండి ఆరోగ్య సంరక్షణకు కావాల్సిన వాటిని తీసుకొని దానిని ఆధునిక పద్దతిలో తయారు చేసి అందివ్వడమే లక్ష్యంగా ఈ 'బృందావనం' లాంచ్ చేశారు.

smitha.jpg

"నా ప్రయాణంలో బృందావనం ఇంకొక కొత్త ప్రయోగానికి సిద్ధం అయింది. కొన్ని రకాలైన పువ్వులు, ఆకులు, పండ్లు, కూరగాయలు వీటన్నితో కలిపి చర్మ సౌందర్యానికి, ముఖ వర్చస్సుకు కావాల్సిన పౌడర్లు, లిక్విడ్స్ తయారు చేశాము. ఇవన్నీ సాంప్రదాయ పద్ధతులలో వుండి, ఇప్పుడున్న యువతకి, అలాగే అన్ని రకాల వయసు వారికి పనికొచ్చే విధంగా మా సొంత ఫ్యాక్టరీ లో తయారు చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాం," అని చెప్పారు స్మిత.

ఇంతకు ముందు ఓల్డ్ స్కూల్ రిచువల్స్‌ను అనే సంస్థను స్మిత స్థాపించారు. దీని ద్వారా పాత సంప్రదాయాలు, ఆచారాల ద్వారా అప్పట్లో ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు ఎలా తీసుకునేవారో అటువంటివే ఈ రిచువల్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు స్మిత. ఓల్డ్ స్కూల్ అనేది పూర్తిగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, చర్మ సౌందర్యాన్ని కాపాడుకునే విధానం, మనిషి ఒత్తిడిలకు గురైనపుడు ఆ సమయంలో మంచి ఆలోచనలు, ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే స్పటికంతో కూడిన ఒక చిన్న గదిని కూడా ఈ బృందావనంలో ఏర్పాటు చేశారు. ఈ 'బృందావనం' అనేది, హైదరాబాదులోని మొట్టమొదటి తరహా సెంటర్ అని తెలుస్తోంది. ప్రత్యేకమైన క్రిస్టల్ ఆయిల్, ఇన్ఫ్యూజ్డ్ థెరపీలు, నేచురోపతిక్ హీలింగ్ పద్ధతులు మరియు విలాసవంతమైన చర్మం, జుట్టు మరియు శరీర సంరక్షణ ఆచారాలను ఈ బృందావరం ద్వారా అందిస్తున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 05:49 PM