Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 08 , 2024 | 07:36 PM
ప్రస్తుతం టాలీవుడ్‌లో సమంత పేరు మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సమంత పేరు హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ వ్యాఖ్యలతో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. ఇంతకీ త్రివిక్రమ్ ఏమన్నారంటే..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సమంత (Samantha) పేరు మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ (Konda Surekha).. మాజీ మంత్రి, బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సమంత పేరు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పిందనుకోండి. అయినా కూడా సమంత విడాకులకు కారణం ఏమిటని, ఇంత వరకు ఎందుకు బయట పెట్టలేదనే విషయాన్ని కొండా సురేఖ గుచ్చి గుచ్చి మీడియా ముందు చెప్పడంతో.. ఇంకా టాపిక్ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సమంతపై చేసిన వ్యాఖ్యలు మరింతగా వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ
కొన్నాళ్లుగా సమంత టాలీవుడ్‌ని వదిలి బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తుంది. ముంబైలోనే ఎక్కువగా దర్శనమిస్తోంది. దీంతో ఆమె అభిమానులు నిరాశకు లోనవుతున్నాయి. అలాగే దర్శకులు కూడా సమంత విషయంలో వెనకడుగు వేస్తున్నారు. కారణం ఆమె హెల్త్ ప్రాబ్లమ్ ఒకటి అయితే.. రెండోది ఆమె టాలీవుడ్‌లో సినిమాలు చేస్తుందా? లేదా? అనేది క్లారిటీ లేకపోవడం. అందుకే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘జిగ్రా’ అనే ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌గా హాజరైన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇదే వేడుకకు మరో గెస్ట్‌గా హాజరైన సమంతపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. (Trivikram Comments on Samantha)
‘‘తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ అభిమానగణం ఉన్న నటులలో రజనీకాంత్ తర్వాత సమంతే ఉంటారు. సమంత ‘ఏం మాయ చేసావే’ మూవీ నుంచే హీరో. అప్పటి నుంచే సమంతకు బన్నీ కూడా అభిమాని. స్త్రీలకు వేరే శక్తి అక్కరలేదు. స్త్రీనే ఓ శక్తి. అందుకే నవరాత్రులు అంటూ స్త్రీలను పూజించుకుంటున్నాము. సమంత ముంబైలోనే కాకుండా.. హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు రావాలని కోరుకుంటున్నాను. మీరు హైదరాబాద్‌లో లేరని, మీరు చేయడం లేదని మేం మీకు కథలు రాయడం లేదు. మీరు నటిస్తానంటే మేం రాస్తాం. ‘అత్తారింటికి దారేది’ లాగా సమంత కోసం ‘హైదరాబాద్‌కు దారేది’ అని అనాలేమో. అందరూ సమంత హైదరాబాద్ రావాలని ట్రెండ్ చేయాలి. ఆమె మళ్లీ తెలుగు సినిమాలలో కంబ్యాక్ ఇవ్వాలని కోరుతున్నాను’’ అన్నారు. త్రివిక్రమ్ ఇలా మాట్లాడుతుంటే.. హాజరైన వారంతా తమ క్లాప్స్‌తో సమంతకు తమ వినతిని తెలియజేశారు.
Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్
అంతకు ముందు సమంత మాట్లాడుతూ.. ‘‘హీరోయిన్స్‌గా మాకు ఓ బాధ్యత ఉంటుంది. మా సినిమాలు చేసే అమ్మాయిలకు ఎవరి కథలో వారే హీరో అనే విషయాన్ని గుర్తుచేయటం. ఆలియా భట్ ఆ విషయాన్ని తన సినిమా ద్వారా గుర్తు చేసింది. రానా నాకు బ్రదర్ లాంటివాడు. అతని లాంటి బ్రదర్ ప్రతి అమ్మాయికి ఉండాలి. తెలుగు వారి ప్రేమ వల్లే ఎదిగాను. నాకు జిగ్రాస్ అంటే నా అభిమానులే..’’ అని చెప్పుకొచ్చింది.