యంగ్ చాప్ ఎన్టీఆర్‌కు నారా భువనేశ్వరి ఆశీస్సులపై వైవిఎస్ చౌదరి స్పందనిదే..
ABN , Publish Date - Nov 02 , 2024 | 09:01 PM
నందమూరి ఫ్యామిలీ నుండి కొత్తగా పరిచయం అవుతోన్న జానకి రామ్ తనయుడు ఎన్.టి. రామారావుకు.. హరికృష్ణ సోదరి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. ఈ ఆశీస్సులపై తాజాగా వైవిఎస్ చౌదరి ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఏముందంటే..
నందమూరి ఫ్యామిలీ నుండి కొత్తగా పరిచయం అవుతోన్న జానకి రామ్ తనయుడు ఎన్.టి. రామారావుకు.. హరికృష్ణ సోదరి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో పాటు, నిర్మాణ సంస్థకు, దర్శకుడు వైవిఎస్కు, టీమ్ అందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. నారా భువనేశ్వరి ఇచ్చిన ఆశీస్సులకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దర్శకుడు వైవిఎస్ చౌదరి ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..
Also Read-Deepika Padukone: కూతురు పేరు రివీల్ చేసిన దీపికా.. అబ్బా ఎంత మంచి పేరు
‘‘శ్రీమతి నారా భువనేశ్వరిగారి దివ్య సముఖమునకు..
అమ్మా..
నా దర్శకత్వంలో, ‘న్యూ టాలెంట్ రోర్స్@’ సంస్థ తరపున ‘నందమూరి’ నాల్గవ తరం ‘కథానాయకుడు’గా ‘నందమూరి తారక రామారావు’ (ఎన్.టి.ఆర్)ని పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘షో రీల్’ని చూసి, మా ‘కథానాయకుడు’ ‘ఎన్.టి.ఆర్’నీ మరియూ నన్నూ అభినందించడం.. మాకెంతో సంతోషాన్ని, మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగించింది, మరెంతో బలాన్ని చేకూర్చింది. ‘మా దైవం’గా భావించే ‘విశ్వవిఖ్యాత’, ‘అన్న’ ‘ఎన్.టి.ఆర్’గారి అభిమానులు ఎప్పుడు ఏ సమస్యతో మిమ్మల్ని చేరినా, వారిని ఎంతో ఆత్మీయంగా, మీ సొంత కుటుంబ సభ్యునిగా చేరదీసి ఆదుకున్న మీలోని ‘అమ్మతనం’ మేమెప్పటికీ మరిచిపోలేని, మీ బుుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనిది. అటువంటి మీ చల్లని ఆశీస్సులు, అండదండలు, ఆప్యాయతానురాగాలు.. మా ‘కథానాయకుడు’ ‘నందమూరి తారక రామారావు’ (ఎన్.టి.ఆర్)కీ, నాకూ, మా చిత్రానికీ మరియూ మా ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ సంస్థకీ ఉన్నందుకూ.. అవి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ దర్శకుడు వైవిఎస్ చౌదరి తన సంతోషాన్ని తెలియజేశారు.
నారా భువనేశ్వరి ఏమని ట్వీట్ చేశారంటే..
తాజాగా నారా భువనేశ్వరి (Nara bhuvaneswari) కూడా సోషల్ మీడియా వేదికగా జానకీరామ్ కుమారుడు ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘‘వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో మా రామ్ హీరోగా పరిచయం అవుతున్నాడన్న విషయం తెలిసి చాలా థ్రిల్ ఫీలయ్యా. గర్వంగానూ ఉంది. తెలుగు ఆడియన్స్ హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంటాడని నమ్ముతున్నా. జానకీరామ్ కొడుకుగా, దివంగత నా సోదరుడు హరికృష్ణగారికి మనవడిగా, లెజండరీ ఎన్టీఆర్‌గారికి మునిమనవడిగా మా కుటుంబ వారసత్వాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తాడని పూర్తి నమ్మకం ఉంది’’ అని అన్నారు.