Suresh Productions: ఈ నిర్మాతని అప్పట్లో కమల్ హాసన్ అనుకొని కారు ఆపేసేవారు

ABN , Publish Date - Jun 03 , 2024 | 02:02 PM

నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తన పెద్ద కుమారుడు సురేష్ బాబుని నటుడిగా చెయ్యాలని ముందుగా అనుకున్నారు, ఎందుకంటే అప్పట్లో అతను కమల్ హాసన్ లో ఉండేవారని, అతను వస్తుంటే కారుని కూడా ఆపేసేవారని చెప్పారు.

Suresh Productions: ఈ నిర్మాతని అప్పట్లో కమల్ హాసన్ అనుకొని కారు ఆపేసేవారు
Daggubati Venkatesh and Suresh Babu

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతల్లో దగ్గుబాటి రామానాయుడు ఒకరు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించడమే కాకుండా, భారతదేశంలో అన్ని అధికార భాషల్లో చిత్రాలు నిర్మించి శెభాష్ అనిపించుకున్న నిర్మాత. ఆ సంస్థకి ఇప్పుడు అరవయ్యేళ్లు కూడా పూర్తయ్యాయి. రామానాయుడు లేకపోయినా, అతని కుమారులు, మనవలు ఆ సంస్థని ముందుకు తీసుకువెళుతున్నారు. (People used to stop producer Suresh Babu's car as he looks like Kamal Haasan)

sureshbabuoldpic.jpg

రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా ఆ సంస్థని ముందుకు తీసుకెళ్లి తండ్రి తరహాలో విజయవంతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేష్ నటుడిగా అగ్రనటుల్లో ఒకరుగా చలామణీ అవుతున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర విషయం వుంది. రామానాయుడు పలు ఇంటర్వ్యూలలో చెపుతూ ఉండేవారు, సురేష్ బాబుని ముందుగా నటుడిగా చేద్దామని అనుకున్నారు, కానీ అతనికి నటనపై ఆసక్తి లేకపోవటంతో ఊరుకున్నారు. (Movie Moghul Ramanaidu wanted to his elder son Suresh Babu as actor, because he looks very handsome when he was young)

"సురేష్ బాబు యంగ్ గా ఉండేటప్పుడు చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడు, అలాగే కమల్ హాసన్ లా ఉండేవాడు. అతన్ని చూసి అప్పట్లో చాలామంది కమల్ హాసన్ అనే అనుకునేవారు, చెన్నై వీధుల్లో సురేష్ బాబు వెళుతుంటే, కారాపి మరీ కమల్ హాసన్ అని చూడటానికి ప్రజలు వచ్చేవారు," అని రామానాయుడు చెపుతూ ఉండేవారు. అందుకే సురేష్ బాబుని నటుడిగా చెయ్యమని అడిగారు రామానాయుడు, కానీ సురేష్ కి నటనపై ఆసక్తి లేకపోవటంతో నిర్మాతగా మారారు.

sureshbaburana.jpg

కృష్ణ, దర్శకుడు కె రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో రామానాయుడు 'కలియుగ పాండవులు' సినిమా నిర్మించాలి, కానీ కృష్ణ ఇంకొక నిర్మాతని కూడా కలుపుకోమన్నారు. కానీ రామానాయుడు తాను సోలో నిర్మాతగా సినిమా చేస్తాను అని చెప్పడంతో, కృష్ణ అయితే మరోసారి చేద్దాం అని చెప్పడంతో ఆ సినిమా పక్కన పెట్టేరు. కానీ రామానాయుడుకి ఆ కథ నచ్చడంతో, కొత్తవాళ్లతో చేద్దామని అనుకున్నారు. వేరేవాళ్లు ఎందుకు తన రెండో కుమారుడు వెంకటేష్ అమెరికాలో ఉంటే అతన్ని పిలిపించి కొన్ని నెలలు తర్ఫీదు ఇచ్చి, ఆ సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేయించారు. ఆలా వెంకటేష్ నటుడు, సురేష్ బాబు నిర్మాత అయ్యారు.

Daggubatisureshbabukamal.jpg

అలా వెంకటేష్ 'కలియుగపాండవులు' సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా కృష్ణ చెయ్యాలి, కానీ అతని తేదీలు కుదరక, అతని స్థానంలో వెంకటేష్ ని పెట్టి రామానాయుడు సినిమా తీశారు. వెంకటేష్ తరువాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి, ఎక్కువగా మహిళా అభిమానులను సంపాదించుకున్న నటుడిగా పేరుపొంది, అగ్రనటుల్లో ఒకరుగా వున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 02:02 PM