దర్శకుడు కోదండరామిరెడ్డితో ఉన్న ఈ చిన్నారులెవరు?

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:51 AM

మెగాస్టార్‌ చిరంజీవి, విజయశాంతి జంటగా నటిస్తున్న ‘పసివాడి ప్రాణం’ చిత్రం పాటల చిత్రీకరణ కశ్మీర్‌లో జరుగుతోంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

అరుదైన చిత్రం

మెగాస్టార్‌ చిరంజీవి, విజయశాంతి జంటగా నటిస్తున్న ‘పసివాడి ప్రాణం’ చిత్రం పాటల చిత్రీకరణ కశ్మీర్‌లో జరుగుతోంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ షూటింగ్‌కు ఇద్దరు చిన్నారులు కూడా వచ్చారు. ముద్దుగా, బొద్దుగా ఉన్న ఆ చిన్నారులను చూసి కోదండరామిరెడ్డి ముచ్చట పడ్డారు. అందులో ఒకరిని తన ఒళ్లోకి తీసుకుని ఆయన ముద్దులాడారు. మరొకతను ఆయన్ని ఆనుకుని నిలబడ్డాడు. ఇంతకీ ఈ చిన్నారులెవరో తెలుసా? కోదండరామిరెడ్డి ఒళ్లో ఉన్న బుడతడు మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌, ఆయన పక్కనున్నది అల్లు అరవింద్‌ కుమారుడు అర్జున్‌. నిజంగా ఇది అరుదైన దృశ్యమే కదూ!

Updated Date - Sep 12 , 2024 | 09:51 AM