Amaran OTT: ఓటీటీలోకి అమరన్.. మరోసారి సాయి పల్లవితో ప్రేమలో
ABN , Publish Date - Nov 30 , 2024 | 01:25 PM
తెలుగులో వచ్చిన ‘మేజర్’ వంటిదే ఈ చిత్రం కొత్తగా చెప్పడానికి ఏముంటుంది.. వాటి తరహాలోనే ఇది కూడా ఉంటుందని అనుకునే వారి ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా తెరకెక్కిన సినిమా ‘అమరన్’. సినిమా ప్రారంభమే ఇందు (సాయి పల్లవి) కోణం నుంచి స్టార్ట్ చేసి చూసే ప్రేక్షకులను కూడా తనతో పాటు ఆ కథలోకి తీసుకెళ్లి భావోద్వేగ ప్రయాణం చేయించారు.
అమరన్.. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఒక వైపు 'లక్కీ భాస్కర్', 'క' వంటి బ్లాక్‌బస్టర్ స్ట్రెయిట్ సినిమాల నుండి పోటీని తట్టుకొని మరి ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాకి మేజర్ హైలెట్‌గా సాయి పల్లవి నటన నిలవగా శివ కార్తికేయన్ యాక్షన్, ఎమోషన్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు చేరవయ్యేందుకు సిద్ధమైంది. ఎక్కడ? ఎప్పుడు? అంటే..
తాజాగా ఈ సినిమా మేకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ వేదికను, స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 5 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. సినిమా విడుదలకు ముందే తెలిసిన కథతో.. శివ కార్తికేయన్, సాయి పల్లవి వంటి ప్రతిభావంతమైన క్యాస్టింగ్‌తో మంచి బజ్ తెచ్చుకున్న చిత్రం ‘అమరన్’. నిజ జీవితంలో జరిగిన ఓ మిలటరీ అధికారి కథను తెరకెక్కించడం దానిని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ , సోనీ పిక్టర్స్ వంటి ప్రముఖ సంస్థలు స్వయంగా నిర్మించడంతో తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ సౌత్ ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న కథానాయిక సాయి పల్లవి సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటించడం కూడా క్రేజ్‌కు కారణమయింది.
Also Read-RC 16: చరణ్ వర్సెస్ మున్నా భయ్యా.. మీర్జాపూర్
ఈ సినిమా కథ విషయానికొస్తే.. 2014లో కశ్మీర్లో ఉగ్రవాదులను ఎదురించి వీరమరణం పొందిన తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీగా తెరకెక్కిన ఈ సినిమాలో ముకుంద్‌గా శివ కార్తికేయన్, ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి నటించింది. ఐదేండ్ల ప్రాయంలోనే మిలటరీ మార్చ్‌ను చూసి ఎప్పటికైనా ఆర్మీలో చేరాలని ముకుంద్ లక్ష్యంగా పెట్టుకుని, తన గ్రాడ్యుయేషన్ టైం నుంచి అందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో తను డిగ్రీ చదువుతున్న కాలేజీలోకి కొత్తగా మలయాళీ అయిన ఇందు రెబెకా వర్గీస్ చేరడం, వారి పరిచయం ప్రేమగా మారడం జరిగిపోతాయి. ఆ పై ఆర్మీలో చేరిన ముకుంద్ ఇందును పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఇష్యూ, ఆర్మీలో కెప్టెన్‌గా, కమాండర్‌గా, మేజర్‌గా ఎదగడం.. రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేషన్‌పై రావడం జరుగుతుంది. ఈక్రమంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులను అంతమొందించి ఎలా అమరుడయ్యాడనే నేపథ్యంలో సినిమా కథ నడుస్తుంది.
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి