Kill OTT: ఓటీటీకి వచ్చేసిన.. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ! జాన్ విక్ కూడా పనికిరాదు
ABN , Publish Date - Sep 06 , 2024 | 09:45 AM
యాక్షన్ థ్రిల్లర్ అభిమానులను అలరించేందుకు తాజాగా హిందీ నుంచి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జూలై 5న థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. జాన్ విక్ సినిమాలను మైమరిపించింది.
యాక్షన్ థ్రిల్లర్ అభిమానులను అలరించేందుకు తాజాగా హిందీ నుంచి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్ (Kill) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జూలై 5న థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఈసినిమాలో లక్ష్య (Lakshya) హీరోగా నటించగా నిఖిల్ నగేష్‌భట్ (Nikhil Nagesh Bhat) రచన, దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహర్ (Karan Johar) గునీత్ మోంగా (Guneet Monga), అపూర్వ మెహతా (Apoorva Mehta), అచిన్ జైన్ (Achin Jain) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాన్య మానిక్తలా (Tanya Maniktala), రాఘవ్ జుయల్ (Raghav Juyal), అశిష్ విద్యార్థి (Ashish Vidyarthi), హర్స్ ఛాయా (Harsh Chhaya) కీలక పాత్రలు చేశారు. హాలీవుడ్ జాన్ విక్ (John Wick) సినిమా మాదిరి కథతో వచ్చిన ఈ హిందీ చిత్రం నేటి యూత్‌లోకి బాగా చొచ్చుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసింది.
కథ విషయానికి వస్తే.. NSG ఆర్మీ కమెండో అమృత్ రాథోడ్ తను ప్రేమించిన తులికకు తనకు ఇష్టం లేకుండా మరొకరితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. ఆ పెళ్లిని ఎలాగైనా అడ్డుకోవాలని ఢిల్లీకి రైలులో బయలుదేరుతాడు అమృత్. అదే ట్రైన్‌లో తులిక ఫ్యామిలీ కూడా ప్రయాణిస్తుంటుంది. అయితే సడన్‌గా ఆ రైలులోకి ఓ క్రూరమైన దొంగల ముఠా చేరి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ, హింసిస్తుంటారు. అందరి దగ్గర దోచుకుని, అడ్డు వచ్చిన వారిని చంపేస్తుంటారు. దీంతో అమృత్ తన వారిని, ప్రయాణికులను రక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలో అమృత్ ఆ ముఠా నుంచి తన ప్రేమయసిని, వారి కుటుంబాన్ని, ఇతర ప్రయాణికులను రక్షించగలిగాడా, లేదా వారితో ఎలా పోరాటం చేశాడనే కథకథనాలతో సినిమా సాగుతుంది.
ఇప్పుడు ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar)లో కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. జాన్ విక్, హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చి తీరుతుంది. సినిమాలో అంతా విద్వంసమే కాబట్టి భాషతో ఎక్ఉవ ఇబ్బంది అనిపించదు. సినిమాలో అసభ్య సన్నివేశాలు లేవు గారీ మితిమీరిన హింసా దృశ్యాలు బాగా డిస్ట్రబ్ చేస్తాయి. పిల్లలతో కలిసి చూడక పోవడం బెటర్. ముఖ్యంగా హీరో కనిపించిన వస్తువుతో దొరికిన వాడిని దొరికినట్టు నరుక్కుంటూ పోవడం, జాలీ దయ లేకుండా ప్రత్యర్థులను వేటాడే నేపథ్యంలో ఈ సినిమా అద్యంతం భారీ హింసాత్మక సన్నివేశాలతో సాగుతూ ఉంటుంది. శత్రువులే జంకుతూ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని ఉండే యాక్షన్ సీన్స్‌తో సినిమాను ఆసక్తి కరంగా జాన్ విక్ సినిమాలను మైమరిపించేలా తెరకెక్కించారు.
ఇదిలాఉండగా ఈ కిల్ (Kill) సినిమా థియేటర్లలో విడుదలకు ముందే గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా మంచి అప్లాజ్ రావడమే కాక అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అంతేకాదు హాలీవుడ్ వారి దృష్టి ఈ చిత్రంపై పడడంతో పాటు జాన్ విక్ (John Wick) సినిమాలను రూపొందించిన లయన్స్ గేట్ (Lionsgate), 87 ఎలవెన్ ఎంటర్ టైన్‌మెంట్ (87 Eleven Entertainment) ఈ బాలీవుడ్ కిల్ (Kill) చిత్రాన్ని హాలీవుడ్‌లో రిమేక్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడం గమనార్హం.