Bramayugam: ఓటీటీలోకి వచ్చేసిన మెగాస్టార్ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రం
ABN , Publish Date - Mar 15 , 2024 | 01:26 PM
లెజెండరీ యాక్టర్, మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రం ‘భ్రమయుగం’. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం ఓటీటీ సందడికి సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న సోనీ లివ్ సంస్థ మలయాళంతో పాటు.. తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో మార్చి 15 నుండి అందుబాటులోకి తెచ్చింది.
లెజెండరీ యాక్టర్, మెగాస్టార్ మమ్ముట్టి (Legendary actor Mammootty) ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ (Psychological Horror Thriller) చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం ఓటీటీ సందడికి సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న సోనీ లివ్ (SonyLiv) సంస్థ మలయాళంతో పాటు.. తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో మార్చి 15 నుండి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం సోనీ లివ్‌లో ఈ సినిమా మంచి స్పందనను రాబడుతున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారికి ఇదే మంచి ఛాయిస్. ఇప్పుడే సోనీ లివ్ ఆన్ చేసి ఈ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రాన్ని ఎంజాయ్ చేయండి.
‘భ్రమయుగం’ కథ విషయానికి వస్తే.. (Bramayugam Story)
ఈ కథ 17వ శతాబ్దంలో మలబారు తీరంలో జరిగింది. తక్కువ కులానికి చెందిన ఒక జానపద గాయకుడైన దేవన్ (అర్జున్ అశోకన్) యుద్ధం వచ్చినప్పుడు ఆ రాజ్యం నుండి తప్పించుకుని, ఇంకొక మిత్రుడితో తన తల్లిని కలుసుకోవాలని అడవుల వెంట పరిగెడుతూ వుంటారు. దారితప్పి అడవిలో తిరుగుతున్న వారికి, ఒక యక్షి (అమల్దా లిజ్) వచ్చి దేవన్ మిత్రుడిని చంపేస్తుంది. దేవన్ ఒక్కడే ఆహారం కోసం వెతుకుతూ ఆ అడవిలో దారి తప్పి ఒక పాడుబడ్డ భవనం చేరుకుంటాడు. ఆ భవనంలో కొడుమన్ పొట్టి (మమ్ముట్టి), అతని వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) ఉంటారు. అక్కడకు వచ్చిన దేవన్‌ని చూసి.. చాలాకాలం తరువాత వచ్చిన అతిధి అని ఆ భవనంలో ఉండమంటాడు కొడుమన్. (Bramayugam OTT Update)
కొన్ని రోజుల తరువాత దేవన్‌కి వింతైన సంఘటనలు, అనుభూతులు ఆ భవనంలో ఎదురవుతూ ఉంటాయి. అలాగే తను ఆ భవనంలో బంధీ అయిపోయాను అని తెలుసుకుంటాడు. అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తాడు, కానీ అతనికి సాధ్యం కాదు. కొడుమన్ పొట్టి.. దేవన్ గురించి చాలా విషయాలు చెప్తాడు, తాంత్రిక విద్యలు కూడా తెలుసు. ఇంతకీ ఈ కొడుమన్ పొట్టి ఎవరు.. అతని నేపధ్యం ఏమిటి? వంటవాడికి అతనికి గల సంబంధం ఏంటి.. ఎందుకు వంటవాడు ఆ భవనంలో ఉంటాడు? ఆ భవనంలో వింతైన శబ్దాలు వినపడుతూ ఉండటానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ‘భ్రమయుగం’ సినిమా చూడాల్సిందే. (#Bramayugam)
ఇవి కూడా చదవండి:
====================
*Hanuman OTT: ఏందయ్యా ఇది.. ఈ ఊరించడమేంటి? ఇంట్రెస్ట్ పోతోంది..
****************************
*Ritika Singh: తలైవర్‌కు ఎప్పటికీ రుణపడివుంటా..
*******************************
*AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్
*****************************