Siddharth Roy: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. పిల్ల‌ల‌ను దూరంగా ఉంచండి

ABN , Publish Date - May 03 , 2024 | 06:32 AM

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన తెలుగు చిత్రం ఎట్ట‌కేల‌కు డిజిటిల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Siddharth Roy: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. పిల్ల‌ల‌ను దూరంగా ఉంచండి
siddharth roy

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన తెలుగు చిత్రం ఎట్ట‌కేల‌కు డిజిటిల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అత‌డు సినిమాలో బ్ర‌హ్మానందం కుమారిడిగా న‌టించి మెప్పించిన‌ బాల న‌టుడు దీపక్ సరోజ్ (Deepak Saroj) హీరోగా ఎంట్రీ ఇస్తూ , త‌న్వి నేగి (Tanvi Negi) క‌థానాయిక‌గా తెర‌కెక్కిన‌ చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) ఫిబ్రవరి 23న థియేట‌ర్ల‌లో విడుదలైన ఈ చిత్రం యూవ‌త‌ను బాగా ఆక‌ట్టుకుంది. దాదాపు రెండు నెల‌ల గ్యాప్‌ త‌ర్వాత ఈ రోజు (మే 3 ,శుక్ర‌వారం) సాయంత్రం నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది.

siddharthroystills.jpg

విడుద‌ల‌కు ముందు నుంచే రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ సినిమా ఆ స‌మ‌యంలో టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. దానికి కార‌ణం ఇందులోని బోల్డ్‌ కంటెంట్‌. హైక్యూ అధికంగా ఉండి ప్రాక్టిక‌ల్‌గా లైఫ్‌ను లీడ్ చేసే యువ‌కుడు సిద్ధార్థ్ రాయ్ (Siddharth Roy) (దీప‌క్ స‌రోజ్‌).చిన్న‌త‌నం నుంచే పుస్త‌కాలు విప‌రీతంగా చ‌దివి ప్ర‌స్తుత స‌మాజం ఫిలాస‌ఫీనంత‌టినీ అణువ‌ణువు ఒంట బ‌ట్టించుకుంటాడు. త‌న దైనందిన జీవితంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ప్ర‌తి దాంట్లో లాజిక్‌ను మాత్ర‌మే ఫాలో అవుతూ అప్ప‌టిక‌ప్పుడే త‌న కోరిక‌ల‌ను తీర్చుకుంటూ అంతా నేనే అన్న‌ట్లుగా జీవిస్తుంటాడు.


ఈక్ర‌మంలో క‌థానాయిక ఇందు (త‌న్వి నేగి) ఎంట్రీ ఇచ్చాక సిద్ధార్థ్ రాయ్ (SiddharthRoy ) జీవితంలో చిన్న‌గా మార్పులు మొద‌లై అ అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ ఆ త‌ర్వాత త‌ను ప్రాక్టిక‌ల్‌గా జీవించ‌లేక ఎమోష‌న్స్‌ను ఫీల్ అవ‌లేక తీవ్ర ఇబ్బందులు ఎద‌ర్కొంటుంటాడు. ఈ నేప‌థ్యంలో అంద‌రితో ర్యాష్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మ‌రి చివ‌ర‌కు సిద్ధార్థ్ ల‌వ్‌ను ఇందు అంగీక‌రించిందా, వారిద్ద‌రు ఒ్ట‌య్యారీ చివ‌ర‌కు ఏమైంది అనేదే చిత్ర క‌థ‌. నేటి యూత్‌ను టార్గెట్‌గా చేస్తూ వ‌చ్చిన‌ సినిమాను ఫ్యామిలీ అడియన్స్‌తో క‌లిసి చూడ‌డం క‌ష్టం కాబ‌ట్టి పిల్ల‌ను ఈసినిమాకు దూరంగా ఉంచ‌డం బెట‌ర్‌.

Updated Date - May 03 , 2024 | 06:32 AM