Gyaarah Gyaarah OTT: ఓటీటీలో.. అదిరిపోయే ఫాంట‌సీ ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ సిరీస్! అస‌లు వ‌ద‌ల‌కండి

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:51 PM

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చిన ఓ ఫాంట‌సీ ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ సిరీస్ గ్యారా గ్యారా వీక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంది. అంత‌గా ప్ర‌చారం లేకుండా అనామ‌కంగా వ‌చ్చిన ఈ సిరీస్ చూసే ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతూ అద‌రిపోయే థ్రిల్‌ను ఇస్తోంది.

1111

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చిన ఓ ఫాంట‌సీ ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ సిరీస్ గ్యారా గ్యారా (Gyaarah Gyaarah) వీక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంది. అంత‌గా ప్ర‌చారం లేకుండా అనామ‌కంగా వ‌చ్చిన ఈ సిరీస్ చూసే ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతూ అద‌రిపోయే థ్రిల్‌ను ఇస్తోంది. 2016లో కొరియాలో వ‌చ్చిన సిగ్న‌ల్ అనే సిరీస్‌ను ఆడాప్ట్ చేసుకుని గ్యారా గ్యారా (Gyaarah Gyaarah) గా హిందీలో తెర‌కెక్కించి ఆగ‌స్టు 9 నుంచి జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫాంలో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌చ్చారు. ఇటీవ‌ల కిల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాఘ‌వ్ జుయ‌ల్ (Raghav Juyal) మెయిన్ లీడ్‌గా న‌టించ‌గా కృతిక కమ్రా (Kritika Kamra), ధైర్య కర్వా (Dhairya Karwa), ఆకాష్ దీక్షిత్ (Aakash Dixit), ముక్తి మోహన్ (Mukti Mohan) ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఉమేశ్ బిస్ట్ (Umesh Bist) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

GWSoej-aEAAuhcv.jpeg

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఈ సిరీస్ ప్ర‌ధానంగా 1990, 2001, 2016 టైంలైన్ల‌లో ఉత్తరాఖాండ్ స్టేట్‌లో జ‌రిగే క్రైమ్స్‌, ఇన్వెస్టిగేష‌న్ సీరియ‌ల్ మ‌ర్డ‌ర్స్‌ నేప‌థ్యంలో మూడు స్టోరీల చుట్టూ న‌డుస్తుంది. 2016లో కొత్త‌గా విధుల్లో చేరిన యుగ్ ఆర్య అనే పోలీస్ ఇన‌స్పెక్ట‌ర్ వాకీ టాకీకి.. డిఫ‌రెంట్ టైమ్‌లైన్‌లో(1990, 1998, 2001 సంవ‌త్స‌రాల‌లో) ఇన్‌స్పెక్ట‌ర్‌గా ఉన్న‌ శౌర్య వాకీ టాకీ నుంచి ఓ రాత్రి స‌రిగ్గా 11.11 గంట‌ల‌కు కాల్ వ‌స్తూ ఉంటుంది. కేవ‌లం ఒక్క నిమిషం మాత్ర‌మే స‌మ‌యం ఉంటుంది.

GWdrjOSaEAA1Qcm.jpeg

అయితే వారు మాట్లాడుకునే టైమ్‌లైన్లు వేరు అనే సంగ‌తి వారికి చాలా రోజుల వ‌ర‌కు తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో వారు పెండింగ్ కేసులకు సంబంధించిన చిన్న‌చిన్న లీడ్స్ తీసుకుని కేసుల‌ను ప‌రిశోధిస్తుంటారు. మొద‌ట 1990 నుంచి శౌర్య ఇచ్చిన ఓ లీడ్‌తో అప్ప‌టికీ 15 ఏండ్లుగా పెండింగ్‌లో ఉంటూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న ఓ బాలిక కిడ్నాప్‌, మ‌ర్డ‌ర్ కేసును 2016లో యుగ్ ఆర్య సాల్వ్‌ చేస్తాడు.


GVv1YlqWIAA0Mdg.jpeg

ఇక ఆ త‌ర్వాత‌ 2016లో యుగ్ అర్య నుంచి లీడ్ తీసుకుని 1998, 2001 సంత్స‌రాల‌లో శౌర్య‌ కేసులను ఇన్వెస్టిగేష‌న్ చేయ‌గా అప్పుడు జ‌రిగే మార్పుల వ‌ల్ల‌ భ‌విష్య‌త్తులో 2016లో యుగ్ ఆర్య‌ ఇన్వెస్టిగేట్ చేసే కేసుల‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని కొత్త ప్ర‌మాదాల‌కు కూడా దారి తీస్తాయి. దీంతో శౌర్య‌, యుగ్ అర్యలు వారి టైమ్‌లైన్ల‌లో అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

GWdriZhXkAAubQj.jpeg

ఈ క్ర‌మంలో ఏసీపీ వామికా పాత్ర ఏంటి, ఆమెకు శౌర్య‌కు ఉన్న సంబంధం ఏంటి, వౌర్య ప్రేయ‌సిని ఎందుకు బ‌తికించు్ఓలేక పోయాడు, చివ‌ర‌కు వారు త‌మ కేసుల‌ను చేధించ‌గ‌లిగారా లేదా అస‌లేమైంది అనే ఇంట్రెస్టింగ్ క‌థాక‌థనాల‌తో సిరీస్ సాగుతూ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. టోట‌ల్‌గా 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఎక్క‌డా బోర్ కొట్టదు పైగా నెక్ట్స్ ఏం జ‌రుగ‌బోతుంద‌నే సస్పెన్స్‌తో పిచ్చెక్కిస్తుంది. అయితే ఈ సిరీస్ కేవ‌లం హిందీ భాష‌లో మాత్ర‌మే స్ట్రీమింగ్ అవుతుంది. మంచి థ్రిల్ల‌ర్స్‌, ఫాంట‌సీలు ఇష్ట‌ప‌డే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ గ్యారా గ్యారా (Gyaarah Gyaarah) సిరీస్‌ను మిస్ చేయ‌కండి.

Updated Date - Sep 05 , 2024 | 04:51 PM