Raju Yadav in OTT: ఓటీటీలోకి వచ్చేసిన గెటప్ శ్రీను సినిమా

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:36 PM

బుల్లితెర కమల్ హాసన్‌గా పేరున్న గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. ఎప్పుడూ నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తమిళ్, మలయాళం సినిమాలలో ఉండే సహజత్వంతో కూడిన సన్నివేశాలతో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ సినిమాటిక్ పోకడలకి వెళ్ళకుండా చాలా రియలిస్టిక్‌గా దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలో హల్చల్ చేస్తోంది.

Raju Yadav Movie Still

బుల్లితెర కమల్ హాసన్‌గా పేరున్న గెటప్ శ్రీను (Getup Srinu) హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). ఎప్పుడూ నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తమిళ్, మలయాళం సినిమాలలో ఉండే సహజత్వంతో కూడిన సన్నివేశాలతో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ సినిమాటిక్ పోకడలకి వెళ్ళకుండా చాలా రియలిస్టిక్‌గా దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా థియేటర్లలో అనుకున్నంత సక్సెస్ కాలేదు.. కానీ ఓటీటీలో మాత్రం మంచి స్పందనను రాబట్టుకుంటుందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- 30 Years Prudhvi: ఢిల్లీలో జగన్‌ని ఆ ప్రశ్న అడిగిన విలేఖరిని అభినందించా..

ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా, ప్రేమ పేరుతో వెంటపడే కొద్దిమంది ప్రేమికుల గురించి తరచూ వింటూనే ఉంటాం, కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై అఘాయిత్యాలకి పాల్పడటం, మరికొన్నిసార్లు దేవదాసులుగా మారిపోవడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అలాంటి అపరిపక్వమైన ఆలోచనలున్న ఓ యువకుడి ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘రాజు యాదవ్’. ప్రథమార్థం సినిమా అంతా కూడా హీరో, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది. ద్వితీయార్థంలోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో హైదరాబాద్‌కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్ కంటతడి పెట్టించేలా దర్శకుడు చిత్రీకరించాడు. (Raju Yadav in Aha OTT)


Getup-Srinu.jpg

ఈ చిత్రానికి గెటప్ శ్రీను నటన ప్రధానబలం. ఫేస్ మీద ఎప్పుడు నవ్వుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. ప్రథమార్థంలో నవ్వు మొహంతో కనిపిస్తూ నవ్వించిన ఆయన, ద్వితీయార్థంలో నవ్వుతూనే భావోద్వేగాలని పండించడం విశేషం. దర్శకుడు కృష్ణమాచారి ఒక రియల్ స్టోరీని తీసుకొని, అంతే రియలిస్టిక్‌గా చూపించాడు. సినిమాలో చివరి 20 నిమిషాలు వచ్చే సన్నివేశాల్ని, ఎమోషన్‌ని మలిచిన తీరు తప్పకుండా ఓటీటీ ప్రేక్షకులని అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ.. మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Read Latest Cinema News

Updated Date - Jul 26 , 2024 | 12:24 AM