Honeymoon Express OTT: ఓటీటీలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ రికార్డులే రికార్డులు

ABN , Publish Date - Sep 15 , 2024 | 10:47 PM

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు థియేటర్ల‌లో సరిగా రెస్పాన్స్ రాబట్టుకోనప్పటికీ ఓటీటీలో మాత్రం విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని, సక్సెస్‌ సాధించి రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో సైతం మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా ఓటీటీలో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Honeymoon Express Movie Stills

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు థియేటర్ల‌లో సరిగా రెస్పాన్స్ రాబట్టుకోనప్పటికీ ఓటీటీలో మాత్రం విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని, సక్సెస్‌ సాధించి రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express) థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో సైతం మంచి స్పందనను రాబట్టుకుంటోంది. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం థియేటర్లలో మంచి పోటీలో విడుదలై సరైన గుర్తింపుకు నోచుకోలేకపోయింది. ఈ క్రమంలో మేకర్స్ ఎర్లీగానే ఓటీటీలోకి సినిమాను తెచ్చారు. వారి నిర్ణయం ఇప్పుడు సక్సెస్ అయింది. ఓటీటీలో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల నటనకు, కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఫలితంగా ఈ సినిమా రికార్డ్ వ్యూస్ సాధించినట్లుగా, సాధిస్తున్నట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు. (Honeymoon Express in OTT)

Also Read-Devara: ‘దేవర’ ప్రమోషన్స్.. ఎన్టీఆర్ స్థాయిని దిగజార్చేస్తున్నారుగా..



Honeymonn-Express.jpg

అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీలో 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌తో సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది. మున్ముందు ఈ చిత్రం ఇంకెంత మందిని ఆకట్టుకుని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రాన్ని కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.

Also Read- Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 15 , 2024 | 10:47 PM