Abraham Ozler: ఓటీటీలోకి.. జయరాం సైకలాజికల్, మెడికల్, మిస్టరీ,క్రైమ్ థ్రిల్లర్
ABN , Publish Date - Mar 03 , 2024 | 06:19 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి మరో డబ్బింగ్ చిత్రం సిద్దమైంది. సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 11న విడుదలైన మలయాళ చిత్రం అబ్రహం ఓజ్లర్.అయితే.. సినిమా థియేటర్లలోకి వచ్చిన 60 రోజుల తర్వాత ఇన్నాళ్లకు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి మరో డబ్బింగ్ చిత్రం సిద్దమైంది. సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 11న విడుదలైన మలయాళ చిత్రం అబ్రహం ఓజ్లర్ (Abraham Ozler) కేరళలో రికార్డులు తిరగరాసింది. అలా వైకుంఠపురం, నాన్న, భాగమతి, ధమాకా సినిమాలతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయరాం (Jayaram) హీరోగా రూపొందిన ఈ చిత్రం రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అక్కడ వన్ ఆఫ్ ది హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
సైకలాజికల్, మెడికల్, మిస్టరీ,క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మిధున్ మాన్యువల్ థామస్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇటీవల నేరు సినిమాలో అంధురాలి పాత్రతో ఆకట్టుకున్న అనశ్వర రాజన్ (Anaswara Rajan) ప్రధాన పాత్రల్లో నటించగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ( Mammootty) ఓ కీ రోల్‌లో నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించడం గమనార్హం.
అయితే.. సినిమా థియేటర్లలోకి వచ్చిన 60 రోజుల తర్వాత ఇన్నాళ్లకు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. మార్చి 20 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక కథ విషయానికి వస్తే..
వరుస మర్డర్స్ మిస్టరీల నైపథ్యంలో రంగంలో దిగిన హీరో ఈ కేసును ఎలా చేధించాడనే కథతో పాటు, తన భార్యా, పిల్లలు కిడ్నాప్ అవడం, వాళ్లు చివరకు బతికే ఉన్నారా లేరా, అసలు విలన్ ను ఎలా కనిపెట్టారనే అనే ఆసక్తికర అంశాలతో ఆకట్టుకునేలా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా రూపొందించారు.