OTT: మరణించిన వాళ్లు తిరిగొస్తే.. ఓటీటీలో అదిరిపోయే సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్! ఎందులో అంటే
ABN , Publish Date - Jul 11 , 2024 | 02:50 PM
తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన ఓ కొరియన్ చిత్రం ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని ఇస్తోంది. రెగ్యులర్‌గా వచ్చే థ్రిల్లర్ జానర్లో కాకుండా రివర్స్ స్క్రీన్‌ప్లే, కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంటోంది.
తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన ఓ కొరియన్ చిత్రం రెస్క్యూరెక్టడ్ విక్టిమ్స్ (Resurrected Victims) ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని ఇస్తోంది. రెగ్యులర్‌గా వచ్చే థ్రిల్లర్ జానర్లో కాకుండా రివర్స్ స్క్రీన్‌ప్లేతో వచ్చిన ఈ సినిమా చాలా భిన్నమైన కాన్సెప్ట్‌తో సినీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. 2017లో కొరియన్లో వచ్చిన ఈ చిత్రంలో కిమ్ రే ఓన్ (Kim Rae-won), కిమ్ హే-సూక్ (Kim Hae-sook) ప్రధాన పాత్రల్లో నటించగా ఫ్రెండ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని డైరెకక్ట్ చేసిన క్వాక్ క్యుంగ్-టే (Kwak Kyung-taek) దర్శకత్వం వహించారు.
మరణించిన వాళ్లు తిరిగి వస్తే అనే మిస్టరీ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమా నిడివి గంటన్నరే ఉన్నా చివరి వరకు సస్పెన్స్‌తో సాగుతుంది. కథ విషయానికి వస్తే ఓ నగరంలో జిన్ హంగ్ లాయర్‌గా మంచి ఫోజిషన్లో ఉంటాడు. అయితే అతను అంతకు 7 సంవత్సరాల క్రితం జరిగిన తన తల్లి హత్య కేసును కోర్టులో వాదిస్తూ వచ్చి చివరకు అసలు హంతకుడిని వెతికి పట్టుకుని శిక్ష పడేలా చేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజు సడన్‌గా చనిపోయిన అతని తల్లి తిరిగి వచ్చి కుమారుడిని చంపేందుకు ప్రయత్నం చేస్తుంది దీంతో ఒక్క సారిగా షాక్‌కు గురవుతారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగుతారు. దీంతో కొన్ని కొత్త విషయాలు బయట పడుతాయి. ఇంకా చాలా దేశాలలోనూ ఇలాగే చనిపోయిన వారు తిరిగి వచ్చి తమ మరణానికి కారణమైన వారిని చంపి ప్రతీకారం తీర్చుకుని మాయమై పోతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చనిపోయిన తల్లి తిరిగి వచ్చి సంబంధం తన మరణంతో సంబంధం లేకున్నా కుమారుడిని ఎందుకు చంపాలనుకున్నదే పాయింట్.
అసలు ఏడు సంవత్సరాల క్రితం ఏం జరిగిందనే ఆసక్తికర కథకథనాలతో సినిమా సాగుతూ క్లైమాక్స్ వచ్చేసరికి మంచి ఎమోషనల్‌గా ముగుస్తుంది. 2012లో సౌత్ కొరియాలో వచ్చిన Ha-Ik Park నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రెస్క్యూరెక్టడ్ విక్టిమ్స్ (Resurrected Victims) ఇప్పుడు జియో సినిమా (Jio Cinema) ఓటీటీలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రంలో ఎక్కడా అసభ్య, వల్గారిటీ సన్నివేశాలు ఎలాంటివి కూడా లేవు ఫ్యామిలీ అంతా కలిసి చూసేయవచ్చు.