Gangs of Godavari OTT: ఓటీటీకి వచ్చేసిన.. విశ్వక్ సేన్ రా అండ్ రస్టిక్ మాస్ మసాలా చిత్రం
ABN , Publish Date - Jun 14 , 2024 | 06:43 AM
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ హిట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అంజలి, నేహాశెట్టి జంటగా నటించారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen ) నటించిన రీసెంట్ హిట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అంజలి (Anjali), నేహాశెట్టి (Neha Shetty) జంటగా నటించారు. కృష్ణ చైతన్య (Krishna Chaitanya) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్ట్యూన్ సినిమాస్ (Fortune Four Cinemas) నిర్మించింది. మే 31 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నెల కూడా గడవకు ముందే కేవలం 15 రోజులకే ఓటీటీ (OTT)కి వచ్చేసి సర్‌ఫ్రైజ్ చేసింది.
కథ విషయానికి వస్తే.. గోదావరి దగ్గర ఓ లంకలో లంకల రత్న (విశ్వక్ సేన్) ఒక గ్యాంగ్‌ని వేసుకొని రౌడీలా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ కిరాణా షాపు ఎజెన్సీతో సెటిలవుతాడు. అక్కడితో అగకుండా ఇంకా పై స్థాయికి ఎదగాలని అనుకుంటూ వివిధ మార్గాలను ఎన్నుకుంటాడు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే రుద్రరాజు (గోపరాజు రమణ) దగ్గర పనికి చేరి అక్కడి వ్యవహరాలన్నీ నేర్చుకుంటాడు. తర్వాత అపోజిషన్ నేత నానాజీ (నాసర్)తో రత్న చేతులు కలిపి రుద్రరాజుపై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తాడు .ఆపై నానాజీ కూతురు బుజ్జి (నేహా శెట్టి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.
ఇక ఆ తర్వాత నానాజీ చనిపోవడం, మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు రత్నపై పగ బట్టి ప్రతికారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో రుద్రరాజు కుమారుడు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో రత్న ఎమ్మెల్యేగా ఓడి, రుద్రరాజు మనిషి గెలిస్తాడు. ఈ క్రమంలో చివరకు రత్నను ఏం చేశారు, రత్నపై కత్తి ఎందకు కట్టారు, రత్నమ్మ (అంజలి) ఎందుకు అండగా ఉందనే అసక్తికరమైన కథకథనాలతో సినిమమా సాగుతూ ఆకట్టుకుంటుంది. పూర్తిగా రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.