Narudi Brathuku Natana OTT: ఒక్కటి కాదు.. రెండు ఓటీటీలలోనూ ట్రెండింగ్
ABN , Publish Date - Dec 07 , 2024 | 09:46 PM
సినిమాలోనే సినిమా వాళ్లు పడే బాధలు చూపిస్తే.. అదే నరుడి బ్రతుకు నటన. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీలలో విడుదలై మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఇంతకీ ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏవంటే..
శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. అక్టోబర్ చివరి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందననే రాబట్టుకుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, హ్యూమన్ ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ మంచి ఆదరణను రాబట్టుకుంటోంది.
Also Read-Allu Arjun: చెప్పను బ్రదర్ టు థ్యాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. మీరు మారిపోయారు సార్
ఈ సినిమా రీసెంట్‌గా ఒకటి కాదు రెండు ఓటీటీలలో విడుదలైంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ ఆదరణను చూరకొంటూ రోజురోజుకీ వ్యూస్‌ను పెంచుకుంటూ ట్రెండ్ అవుతోంది. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా. సింధూ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎమోషనల్ రైడ్‌గా, హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రంగా దర్శకుడు రిషికేశ్వర్ యోగి తెరకెక్కించారు. ఫహద్ అబ్దుల్ మజీద్ హ్యాండిల్ చేసిన సినిమాటోగ్రఫీ, ఆయన ఇచ్చిన థ్రిల్లింగ్ విజువల్స్, NYX లోపెజ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాను చూసిన వారంతా ఓ మంచి చిత్రాన్ని చూశామనే ఫీలింగ్ వచ్చిందంటూ తెలుపుతుండటం విశేషం.
‘నరుడి బ్రతుకు నటన’ కథ విషయానికి వస్తే.. సినిమా రిలేటెడ్‌గా జరిగే ఈ కథలో సత్య (శివ కుమార్ రామచంద్రవరపు) నటుడిగా అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తుంటాడు. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా సత్యకు యాక్టింగ్ రాదంటూ అందరూ రిజెక్ట్ చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడం, యాక్టింగ్ రాదని అవమానాలను ఎదుర్కొంటున్న సత్య.. ఆయన తండ్రి, స్నేహితుడు కూడా యాక్టింగ్ రాదు నీకు అని అనడంతో ఇక వారి మధ్య ఉండలేక కేరళ వెళ్లిపోతాడు. కేరళలోని ఓ గ్రామానికి చేరుకున్న సత్యకి అక్కడ సల్మాన్ (నితిన్ ప్రసన్న) అనే వ్యక్తి పరిచయం అవుతాడు. సల్మాన్ పరిచయంతో సత్య ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది? చివరకు అతడు కోరుకున్నట్లుగా యాక్టర్ అయ్యాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.