Janhvi Kapoor: జాన్వీ కపూర్ పోస్ట్.. నయనతార ఎమోషనల్
ABN , Publish Date - Nov 19 , 2024 | 04:33 PM
ఇండియన్ లేడి సూపర్ స్టార్ కూతురు మాటలకి సౌతిండియన్ లేడి సూపర్ స్టార్ ఎమోషనల్ అయ్యింది. దీనికి తోడు తెలుగు సూపర్ స్టార్ కాస్త ప్రేమను జోడించారు. ఇంతకీ ఏమైందంటే..
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) జీవితంపై ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రెడీ అయినా సంగతి తెలిసిందే. నయన్ వృత్తి, వ్యక్తిగత జీవితంపై ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ దీనిని (Nayanthara: Beyond The Fairy Tale) రూపొందించింది. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుండి స్ట్రీమ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు ఈ డాక్యుమెంటరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇంతకీ వాళ్ళు ఏమన్నారంటే..
జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ డాక్యుమెంటరీని కోట్ చేస్తూ.. "బలమైన మహిళను మరింత శక్తిమంతంగా చూడటం కంటే స్ఫూర్తినిచ్చేది ఇంకేదీ లేదు" అంటూ రాసుకొచ్చారు. దీనికి నయనతార ఎమోషనల్ రిప్లై ఇచ్చారు. "డియర్ జాన్వీ నువ్వు పంపించే మెసేజ్ లు చూసి ఎప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటాను. ఈ డాక్యుమెంటరీ చూడటానికి టైమ్ కేటాయించి.. నాపై ప్రేమను ఒలకబోసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బేబీ" అంటూ రీపోస్టు చేశారు.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ డాక్యుమెంటరీని లింక్ ఇన్స్టా స్టోరీ ద్వారా షేర్ చేస్తూ మూడు హార్ట్ సింబల్లను జోడించారు. దీనికి నయన్ ‘మీకు ఈ డాక్యుమెంటరీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ’ అంటూ రీపోస్టు చేశారు.
వీరితో పాటు ఐశ్వర్య రాజేష్, నివిన్ పౌలీ, అవికాగోర్ వంటి నటీనటులు ఇండస్ట్రీ భేదం లేకుండా నయనతారని అభినందించారు. ఇంతకు ముందే.. నయనతార తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొందని నాగార్జున చెప్పారు. నయన్ లేడీ సూపర్ స్టార్ అని రానా పేర్కొన్నారు. రాధికా, ఉపేంద్ర, అట్లీ కూడా నయన్ గురించి చెప్పుకొచ్చారు.