Padma Kasturirangan: ప్రైమ్ వీడియోలో సూపర్ అప్‌గ్రేడ్

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:10 PM

సౌత్ ఇండియాలోనూ ఓటీటీ గేమ్‌ను ఛేంజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది.

గ్లోబల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియాలోను నంబర్ 1 ఓటీటీ ఛాయిస్‌గా నిలిచింది. ఇక సౌత్ ఇండియాలోనూ ఓటీటీ గేమ్‌ను ఛేంజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేనేజ్మెంట్. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్‌కు కొత్త హెడ్‌గా పద్మ కస్తూరి రంగన్‌ను నియమించారు.రెండేళ్ల నుండి ప్రైమ్‌లో కీలక బాధ్యతలు వహిస్తున్న ఆమెకి ఈ అవకాశం రావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కస్తూరి..అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్స్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆమె అన్నపూర్ణ స్టూడియోస్‌తో జాయిన్ అయ్యారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. నెక్స్ట్ మరో మీడియా హౌస్‌లోనూ ఆమె హెడ్‌గా కీలక పాత్ర పోషించారు. మరికొన్ని రోజులు జీ5 ఓటీటీలో చేశారు. అనంతరం ప్రైమ్ వీడియోలో జాయిన్ అయినా ఆమె రూపు రేఖల్ని మార్చేసింది. పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు, షోస్ నిర్మిస్తూ తన మార్క్ వేశారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న 'ది రానా దగ్గుబాటి షో' వెనుక ఆమె హస్తం ఉంది.

MV5BNjhjM2RlOTUtZGYxMi00Y2FhLTllNDYtN2Q4YjMwMzM4OWI4XkEyXkFqcGc@._V1_FMjpg_UX1000_.jpg


ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో తమ నుంచి సూపర్ థ్రిల్లింగ్ సిరీస్ లు, కార్యక్రమాలు వస్తాయని... బలమైన కథలు, మరపురాని పాత్రలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో కొత్త ఒరిజినల్ షోలను, వెబ్ సిరీస్ లను నిర్మిస్తామన్నారు. అలాగే తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన నిఖిల్ మధోక్, గౌరవ్ గాంధీ, జేమ్స్ ఫారెల్ లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Dec 06 , 2024 | 05:24 PM