Padutha Theeyaga: బుల్లితెరపై ఈ షోకు తిరుగులేదు.. సరికొత్త రికార్డ్‌కు చేరువవుతున్న వేళ..

ABN , Publish Date - Sep 24 , 2024 | 09:22 PM

పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా ‘పాడుతా తీయగా’ ఇప్పటికీ రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే 23 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం 24వ సీజన్ ప్రసారమవుతుంది. త్వరలోనే ఈ షో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌ని జరుపుకోబోతోంది.

Padutha Theeyaga Judges

బుల్లితెరపై తిరుగులేని షో ‘పాడుతా తీయగా’ (Padutha Theeyaga). పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా ‘పాడుతా తీయగా’ ఇప్పటికీ రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే 23 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం 24వ సీజన్ ప్రసారమవుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటికి 17 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. బుల్లితెరపై ఎన్ని సాంగ్స్ షో‌లు వచ్చినా.. ‘పాడుతా తీయగా’ షోకు సెపరేట్ ట్రాక్ రికార్డ్, సెపరేట్ క్వాలిటీ ఉంటుందనే హిస్టరీ మాత్రం అలానే ఉంది, ఉంటుంది. ఈ షో 1996లో ప్రారంభమైంది. త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలతో సరికొత్త రికార్డ్‌కు ఈ షో చేరువవుతోంది.

Also Read- Hero Karthi పవన్‌ స్వీట్‌ వార్నింగ్‌కు కార్తి స్పందన

ఈటీవీ పుట్టిన ఈ 30 ఏళ్లలో ‘పాడుతా తీయగా’ షోకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో 500కి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ‘పాడుతా తీయగా’ షో పై స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెరగని ముద్ర వేశారు. ఈ ముద్ర ఈ షో నడిచినంతకాలం అలానే ఉంటుంది. ఈ షోని ఆయన తయారు చేసిన విధానం అలాంటిది మరి. ఆయన ఇచ్చిన సూచనలు, పంచిన సంగీత జ్ఞానం, చెప్పిన విలువైన పాటలు, మాటలు ఈ షోను తెలుగు వారందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. ఆయన లేనప్పటికీ.. ఈ షో పేరు వినబడితే చాలు ఆయన రూపమే కనబడుతుంది. ‘పాడుతా తీయగా’కు, ఎస్పీ బాలుకు ఉన్న కనెక్షన్ అలాంటిది.

Also Read- Kiraak RP: లడ్డు వివాదం.. వైఎస్ జగన్‌పై కిరాక్ ఆర్పీ సంచలన కామెంట్స్


SP-Charan.jpg

ఇక ఇప్పుడు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ షోకు హోస్ట్‌గా ఉంటున్నారు. ఎస్పీబీ వారసత్వాన్ని విజయవంతంగా ఆయన ముందుకు తీసుకువెళుతున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు సునీత, విజయ్ ప్రకాష్ వంటి ప్రముఖ సింగర్స్ ఈ షోలో న్యాయనిర్ణేతలుగా ఉంటూ తమ సంగీత జ్ఞానాన్ని కంటెస్టెంట్లకు, ఆడియెన్స్‌కు పంచుతున్నారు.

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2024 | 09:22 PM