OTT Movie: విడుదలైన మూడు నెలలకు ఓటీటీలోకి రివేంజ్ థ్రిల్లర్.. డిజప్పాయింట్ చేయదు

ABN , Publish Date - Nov 14 , 2024 | 08:00 PM

థియేటర్లలో విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన రివేంజ్ థ్రిల్లర్.. అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఏ ఓటీటీలో ఉందనే వివరాల్లోకి వెళితే..

Revu Movie Still

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం ఆగస్ట్ 23న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. దాదాపు మూడు నెలల తర్వాత ఈ రివేంజ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది.

Also Read- Heroine: కమిట్‌మెంట్ ఇవ్వాలని సిగ్గు లేకుండా అడిగాడు

అంతా కొత్తవారితో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా నిర్మాణ విలువల పెద్ద సినిమాలను తలపించే విధంగా ఉన్నాయనేలా పాజిటివ్ టాక్‌ని రాబట్టుకుందీ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రావడమే కాకుండా మంచి ఆదరణను కూడా రాబట్టుకోవడం విశేషం. ‘రేవు’ చిత్రం రీసెంట్‌గానే ఆహాలోకి వచ్చింది. ఓటీటీలోకి కొత్త సినిమా ఏం వచ్చిందా? అని ఎదురు చూసే వారందరికీ ఈ సినిమా మంచి ఛాయిస్‌గా నిలవడంతో ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఆహాలో ‘రేవు’ ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇలా ఓటీటీలోనూ తమ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుండటంతో చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

Also Read- మిల్కీ బ్యూటీ తమన్నాలో ఈ మార్పు చూశారా..


Revu-Movie.jpg

స్టోరీ లైన్‌కి వస్తే.. పాల‌రేవు అనే ఓ కోస్తా ప్రాంత‌పు గ్రామంలో అంకులు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) ఇద్ద‌రు యువ‌కులు క‌లిసి పెరిగి పెద్ద‌య్యాక పెళ్లిళ్లు చేసుకుని ప‌క్క‌ప‌క్క ఇండ్ల‌ల్లోనే ఉంటూ చేప‌ల వేట వృత్తిగా జీవిస్తూ ఉంటారు. కానీ ఇద్ద‌రు త‌మ వృత్తిలో త‌రుచూ పోటీ ప‌డుతుంటారు, పోట్లాడుకుంటుంటారు. వారికున్న నాటు ప‌డ‌వ‌ల‌తోనే రోజూ వేట సాగిస్తూ జీవిస్తూ ఉంటారు. అయితే అదే స‌మ‌యంలో ఆ ఊరిలోనే ఉండే నాగేశు అనే కాస్త డ‌బ్బున్న వ్య‌క్తి త‌న ఆస్థినంత‌టిని అమ్మేసి ఓ పెద్ద బోటు తీసుకువ‌చ్చి చేప‌ల వేట మొద‌లు పెడ‌తాడు. దీంతో అంకులు, గంగ‌య్యల వృత్తికి ఆటంకం ఏర్ప‌డుతుంది. ఈక్ర‌మంలో నాగేశు త‌మ్ముడి కొడుకు త‌యారు చేసిన మోటారు సాయంతో అంకులు, గంగ‌య్యలు తిరిగి త‌మ చేప‌ల వేట‌ను ముమ్మ‌రం చేసి రాణిస్తారు. ఇది రుచించ‌ని నాగేశు త‌న త‌మ్ముడి కొడుకుని చంపేయ‌డంతో అంకులు, గంగ‌య్యలిద్ద‌రు క‌లిసి నాగేశుని అంత‌మొందిస్తారు. ఇక అంతా సాఫీగానే ఉంటుంద‌ని అనందంలో ఉండ‌గా స‌డ‌న్‌గా సైకిక్ మెంటాలిటీ ఉన్న నాగేశ్‌ ఇద్ద‌రు కుమారులు ఊరిలోకి అడుగు పెడ‌తారు. ఈ నేప‌థ్యంలో నాగేశ్ ఇద్ద‌రు కుమారులు త‌ర్వాత ఏం చేశారు.. అంకులు, గంగ‌య్య ఎలా ఎదుర్కొన్నార‌నే విష‌యాన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read-Matka Review: 'మట్కా'తో వరుణ్‌ తేజ్‌ హిట్‌ కొట్టాడా...

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 14 , 2024 | 08:00 PM