Honeymoon Express: ఓటీటీలో ఈ ఎక్స్‌ప్రెస్ దూసుకెళుతోంది

ABN , Publish Date - Oct 12 , 2024 | 12:14 AM

ఓటీటీలో సినిమాలు అదరగొడుతున్నాయి. ఇటు బాక్సాఫీస్ వద్ద అటు ఓటీటీలోనూ చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడొక సినిమా రెండు ఓటీటీలో మంచి ఆదరణను రాబట్టుకుంటూ, టాప్‌లో దూసుకెళుతోంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

Honeymoon Express Movie Still

ఓటీటీలో సినిమాలు అదరగొడుతున్నాయి. ఇటు బాక్సాఫీస్ వద్ద అటు ఓటీటీలోనూ చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చే చిత్రాలు అయితే ఓటీటీలో దుమ్ములేపేస్తున్నాయి. కొన్ని చిత్రాలు అయితే నెలల తరబడి ట్రెండింగ్‌లో ఉంటూనే ఉన్నాయి. ఈక్రమంలోనే చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express) చిత్రం ఓటీటీలో ట్రెండ్ అవుతూనే ఉంది. చైతన్య రావు చేస్తున్న చిత్రాలు ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఆయన ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌’కి థియేటర్లలో అలాగే ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ రావడం విశేషం.

అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ 70 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌ను క్రాస్ చేసిందీ సినిమా. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ జంట నటన, వారి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతన్నాయి. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి.


Chaitanya-Rao.jpg

ఇక ఈ చిత్రం ఇప్పుడు ఆహా (Aha OTT)లోకి వచ్చి దుమ్ములేపుతోంది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమా.. గత కొన్ని రోజులుగా ఆహా వినియోగదారుల్ని సైతం ఎంటర్‌టైన్ చేస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. అందుకే యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేస్తోంది. ఒక్కటికాదు.. రెండు ఓటీటీలలోనూ ఈ సినిమా మంచి ఆదరణను పొందుతుండటంతో చిత్ర దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Viswam Review: గోపీచంద్‌, శ్రీను వైట్ల కాంబో ఫిల్మ్ ‘విశ్వం’ ఎలా ఉందంటే...

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 12 , 2024 | 12:14 AM