Shakhahaari: ఆహాలో తెలుగులో కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం.. మెయిన్ పాత్రకి డబ్బింగ్ చెప్పిందెవరంటే?
ABN , Publish Date - Aug 24 , 2024 | 04:53 PM
హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించిన నిర్మాత బాలు చరణ్.. ఇప్పుడు కన్నడలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘శాఖాహారి’ తెలుగు అనువాద హక్కులను మంచి రేట్‌కి సొంతం చేసుకున్నారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండాలనే నేపథ్యంలో డబ్బింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆయన.. మెయిన్ పాత్రకి తెలుగులో ఈ మధ్యకాలంలో దూసుకెళుతోన్న ఓ రంగస్థల నటుడితో వాయిస్ చెప్పించడం విశేషం.
హనుమాన్ ప్రొడక్షన్స్ (Hanuman Productions) పతాకంపై ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించిన నిర్మాత బాలు చరణ్ (Balu Charan).. ఇప్పుడు కన్నడలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘శాఖాహారి’ (Shakhahaari) తెలుగు అనువాద హక్కులను మంచి రేట్‌కి సొంతం చేసుకున్నారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండాలనే నేపథ్యంలో డబ్బింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆయన.. మెయిన్ పాత్రకి తెలుగులో ఈ మధ్యకాలంలో దూసుకెళుతోన్న ఓ రంగస్థల నటుడితో వాయిస్ చెప్పించడం విశేషం. ఇంతకీ ఆ తెలుగు నటుడు ఎవరని అనుకుంటున్నారా? తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తండ్రిగా నటించిన గోపరాజు రమణ (Goparaju Ramana).
Also Read- Hero Nani: హేమ కమిటీ రిపోర్ట్.. ‘ఇలా ఎక్కడ జరుగుతుంది’ అని షాకయ్యా.
ఈ సినిమాలో మెయిన్ పాత్రలో నటించిన రంగాయన రఘు పాత్రకి గోపరాజు రమణ చేత డబ్బింగ్ చెప్పించారు. గోపరాజు రమణ డబ్బింగ్ చెప్పిన వెర్షన్ కేవలం ఆహా ఓటీటీ (Aha OTT)లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ఈ సినిమా ఉన్నప్పటికీ.. అచ్చమైన తెలుగు సినిమా అనిపించేలా ఆహాకు ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పించడం విశేషం. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయన రఘు (Rangayana Raghu) ప్రధాన పాత్ర పోచించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ. గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్, నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. మయూరి అంబేకల్లు అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఆదరించే వారికి ఈ ‘శాఖాహారి’ చిత్రం మంచి విందు భోజనంలా ఉంటుంది. సినిమా మొదలు నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తాడు. ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. హనుమాన్ ప్రొడక్షన్స్ నిర్మాత బాలు చరణ్ టేస్ట్ ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ బ్యానర్ నుంచి తెలుగు ప్రేక్షకులకి ఆయన మంచి చిత్రాలు అందిస్తున్నారు. వారి బ్యానర్‌లో వచ్చిన ఎన్నో గొప్ప సినిమాలో ఈ ‘శాఖాహారి’ చిత్రం ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్.. ఇన్ ఆహా.
Read Latest Cinema News