SIMBAA: ఓటీటీలో.. టాప్‌లో ట్రెండ్ అవుతున్న సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘సింబా’

ABN , Publish Date - Sep 16 , 2024 | 09:43 PM

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చిన తెలుగు సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘సింబా’ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఊహించిన దాని క‌న్నా మించి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

SIMBAA

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చిన తెలుగు సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘సింబా’ (SIMBAA) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఊహించిన దాని క‌న్నా మించి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. జగపతి బాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) ప్రధాన పాత్రల్లో నటించ‌గా సంపత్ నంది టీం వర్క్స్ (Sampath Nandi Team Works), రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంపత్ నంది (Sampath Nandi), దాసరి రాజేందర రెడ్డి (Rajender Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది కథ అందించగా మురళీ మనోహర్ (Murali Manohar) దర్శకత్వం వహించారు.

SIMBAA

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆగస్ట్ 9న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ ‘సింబా’ (SIMBAA) మూవీ మిశ్ర‌మ స్పంద‌న‌ను ద‌క్కించుకుని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న‌ప్పటికీ క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

ac844a49-3daa-4bdf-9c22-724a627f45cc.jpeg

గ‌తంలో ఎన్నడు చూడ‌ని విధంగా ప్రకృతికి ఆగ్ర‌హానికి గురైతే ఎలా ఉంటుంది, వృక్షో రక్షతి రక్షితః అనే క‌థ‌తో ఈ సింబా సినిమాను రూపొందించారు. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది ఈ చిత్రంలో చక్కగా చూపించారు.

SIMBAA

బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్, పర్యావరణ సందేశంతో ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 6న అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), ఆహా (Aha) ఓటీటీల్లోకి రాగా గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఈ మ‌ధ్య‌లో చాలా సినిమాలు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చినా ‘సింబా’ (SIMBAA) మూవీ మాత్రం త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఈ సింబా మూవీలోని డైలాగ్స్, సీన్స్ బాగా వైరల్ అవ‌డం విశేషం.

Updated Date - Sep 16 , 2024 | 09:43 PM