Ayalaan: 26న థియేట‌ర్ల‌లోకి.. ఆ వెంట‌నే ఓటీటీలోకి శివ కార్తికేయ‌న్ ‘అల‌యాన్‌’

ABN , Publish Date - Jan 23 , 2024 | 03:58 PM

శివ కార్తికేయ‌న్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం అయ‌లాన్. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా త‌మిళ‌నాట విడుద‌లైన రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. 26న‌ తెలుగులో విడుద‌ల కానున్న ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ తేది బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Ayalaan: 26న థియేట‌ర్ల‌లోకి.. ఆ వెంట‌నే ఓటీటీలోకి శివ కార్తికేయ‌న్ ‘అల‌యాన్‌’
ayalaan

శివ కార్తికేయ‌న్ (Siva karthikeyan), ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) జంట‌గా న‌టించిన తాజా చిత్రం అయ‌లాన్ (Ayalaan). సంక్రాంతి (Pongal) పండుగ సంద‌ర్భంగా త‌మిళ‌నాట విడుద‌లైన ఈ సినిమా విజ‌య‌వంత‌మ‌వ‌డ‌మే కాకుండా రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. తెలుగులోను సంక్రాంతికే విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం ఇక్క‌డే భారీ సినిమాల విడుద‌ల‌వ‌డంతో వాయిదా ప‌డింది. దీంతో అయ‌లాన్ సినిమాను జ‌న‌వ‌రి 26న తెలుగులో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే తెలుగులో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన 15, 16 రోజుల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్ జ‌రుగ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు షికారు చేస్తున్నాయి. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వి కుమార్ (Ravi kumar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శివ కార్తికేయ‌న్ (Siva karthikeyan) త‌న పారితోష‌కాన్ని త‌గ్గించుకుని మ‌రి న‌టించ‌గా బొమ్మ‌రిల్లు సిద్ధార్థ్ కూడా ఎలాంటి డ‌బ్బు తీసుకోకుండానే త‌న వాయిస్ ఇవ్వ‌గా అస్కార్ విన్న‌ర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. అయితే ముందే చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఈ సినిమా ఫిభ్ర‌వ‌రి 16 నుంచి స‌న్ నెక్స్ట్ (Sun NXT ) గానీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


క‌థ విష‌యానికి వ‌స్తే ఓ గ్రామంలో వ్య‌వ‌సాయం చేస్తు ఉండే హీరో అక్క‌డ బాగా అప్పులు కావ‌డంతో సిటీలో త‌న స్నేహితుల‌తో క‌లిసి ఈవెంట్ మేనేజ్ మెంట్ ప‌ని చేస్తు ఉంటారు. ఈ క్ర‌మంలో త‌ప్పిపోయి భూమి మీద‌కు వ‌చ్చిన‌ ఏలియన్ వీరికి జ‌త క‌డుతుంది. వీళ్ల‌ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగా న‌వ్విస్తాయి. ఇలా సాఫీగా న‌డుస్తున్న స‌మ‌యంలో విల‌న్ ఓ వినాశ‌క ప్రాజెక్టును ప్రారంభించ‌డంతో జ‌రిగే న‌ష్టాన్ని ఊహించి ఎలియ‌న్‌,హీరో ఎలా ఎదుర్కొన్నార‌నే పాయింట్ మీద సినిమా చాలా ఆస‌క్తిక‌రంగా రూపొందించారు.

Updated Date - Jan 23 , 2024 | 03:58 PM