Kaliyugam Pattanamlo OTT: సడెన్‌గా ఓటీటీలోకి.. వచ్చేసిన ఇంట్రెస్టింగ్ తెలుగు సైకో థ్రిల్లర్! డోంట్ మిస్.. ఎందులో అంటే?
ABN , Publish Date - May 23 , 2024 | 06:38 AM
ఇటీవల తెలుగులో వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కలియుగం పట్టణంలో ఎలాంటి చప్పుడు లేకుండా సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మార్చి 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌నే తెచ్చుకున్నప్పటికే తర్వాత మేకర్సే సినిమాను థియేటర్ల నుంచి తొలగించడం నాడు సంచలనంగా కూడా మారింది.
ఇటీవల తెలుగులో వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కలియుగం పట్టణంలో (Kaliyugam Pattanamlo) ఎలాంటి చప్పుడు లేకుండా సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మార్చి 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌నే తెచ్చుకున్నప్పటికే మూడు నాలుగు రోజుల తర్వాత మేకర్సే సినిమాను థియేటర్ల నుంచి తొలగించడం నాడు సంచలనంగా కూడా మారింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత విడుదల చేస్తామని చెపప్ఆరు అది కార్య రూపం దాల్చలేదు.. ఉన్నట్టుండి గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Amazon Prime Video) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఆ నలుగురు, జానకి వెడ్స్ శ్రీరామ్, అధినాయకుడు, విష్ణు వంటి ఓ 50 సినిమాల్లో బాల నటుడిగా చేసిన గుర్తింపు పొందిన విశ్వకార్తికేయ (Vishva Karthikeya) ఈ కలియుగం పట్టణంలో (Kaliyugam Pattanamlo) సినిమాలో హీరోగా నటించగా, ఆయుషీ పటేల్ (Ayushi Patel), చిత్రా శుక్లా (Chitra Shukla), దేవీ ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. నంద్యాల కేందంగా జరుగుతన్న వరుస హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. పిల్లల పెంపకం పాయింట్‌ను, ఎమోషల్ సన్నివేశాలతో ఇంట్రెస్టింగ్ సినిమాను రూపొందించారు.
ఇక కథ విషయానిఇక వస్తే.. మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) దంపతులకు విజయ్ ( విశ్వ కార్తికేయ), సాగర్ ( విశ్వ కార్తికేయ) అనే ఇద్దరు కవల పిల్లలు ఉంటారు. అయితే ఇద్దురు పిల్లల్లో విజయ్ సాఫ్ట్‌గా ఉంటే సాగర్ మాత్రం సైకో మనస్తత్వంతో ఉంటాడు. దీంతో సాగర్ చేష్టలను భరించలేక మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. తర్వాత కొన్నాళ్లకు నంద్యాలలో వరుసగా అత్యచారాలు చేసే వారి హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును చేధించడానికి కొత్తగా ఓ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతుంది. ఆ కేసును అమె ఎలా చేదించిందనేది కథ.
మొగాళ్లంటే విపరీతమైన ద్వేషమున్న కథానాయికకు ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి, విజయ్, సాగర్ లలో అసలు మంచి వారెవరు.. చెడ్డవారెవరు, ఆ అత్యచారాలు ఎవరు చేశారనే ఆసక్తికరమైన కథకథనాలతో ఈ కలియుగం పట్టణంలో (Kaliyugam Pattanamlo) సినిమా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్టు అయితే అంతకుమించి అనేలా ఉంటుంది. పైగా ఈ చిత్రానికి సీక్వెల్ ‘కలియుగం.. నగరంలో’ ఉంటుందని రివీల్ చేసి రానున్న సినిమాపై అంచనాలను పెంచేశారు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేని ఈ చిత్రాన్ని ఇంటిల్లిపాది కలిసి చూసేయవచ్చు.