Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గాలా.. వేరే లెవల్ అంతే..
ABN , Publish Date - Jul 02 , 2024 | 09:25 PM
టాప్ 12 సింగర్స్‌తో కూడిన తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా, తెలుగులో రియాల్టీ షోలలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలా ఆడియన్స్, జడ్జస్‌ని మెస్మరైజ్ చేసింది. గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని పంచాయి. చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టి.. ఈ సింగింగ్ షోలలోనే సరికొత్త బెంచ్ మార్క్‌ని సెట్ చేసింది.
టాప్ 12 సింగర్స్‌తో కూడిన తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా (Telugu Indian Idol Season 3 Grand Gala), తెలుగులో రియాల్టీ షోలలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలా ఆడియన్స్, జడ్జస్‌ని మెస్మరైజ్ చేసింది. గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని పంచాయి. చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టగా.. 12 మంది సింగర్స్ కూడా ది బెస్ట్ ఇచ్చి.. కాంపిటేషన్ ఎంత టఫ్‌గా ఉండబోతోందో.. ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నారో క్లారిటీ ఇచ్చేశారు. ఈ గ్రాండ్ గాలా ఈవెంట్ వరకు జరిగిన హైలెట్స్ ఒక్కసారి గమనిస్తే..
Also Read-Reventh Reddy - TFI: అలా చేయకపోతే ఎలాంటి సహకారం ఉండదు!
టాలెంటెడ్ కంపోజర్ థమన్ (S Thaman), యంగ్ సింగర్ స్కందతో కలిసి వేదికపైకి వచ్చారు. వారిద్దరి పెర్ఫార్మెన్స్ ఎనర్జీని నింపింది. ప్రేక్షకలోకం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలైన ‘గేమ్ ఛేంజర్’, ‘పుష్ప 2’ సినిమాల గురించి థమన్, కార్తీక్ ముచ్చటించడం అందరినీ అలరించింది. థమన్ తన సూపర్ హిట్ ‘మగువా మగువా’ పాట వెనుక స్ఫూర్తిని పంచుకోవడం హార్ట్ టచ్చింగ్ మూమెంట్. తన తల్లికి ట్రిబ్యుట్‌గా ఈ పాట చేశాని చెప్పడం ఎమోషనల్ డెప్త్ జోడించింది. గీతా మాధురి (Geetha Madhuri) ఈ పాటను స్టేజ్‌పై హార్ట్ టచ్చింగ్ పాడి అందరినీ అలరించింది.
ఇళయరాజా కంపోజ్ చేసిన పాటకు శ్రీ కీర్తి ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శన యొక్క వీడియోను మాస్ట్రో ఇళయరాజాకి పంపాలని జడ్జిగా ఉన్న సింగర్ కార్తీక్ (Karthik) డిసైడ్ అవ్వడం మరో హైలెట్. అలాగే యువ గాయని కీర్తన జడ్జ్ కార్తీక్‌కు మ్యూజిక్ లెసన్స్‌ని చెప్పడం మరో ఆకర్షణగా నిలిచింది. ఇది నెక్స్ట్ జనరేషన్ ట్యాలెంట్‌ను ప్రజెంట్ చేసింది. మొత్తనికి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గాలా మస్ట్ వాచ్ షోగా నిలిచింది. ఇప్పుడందరి ఫేవరేట్‌గా మారిన ‘తెలుగు ఇండియన్ ఐడల్ 3’ ఆహా ఓటీటీ (Aha OTT)లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.