Sabari: 5నెలల తర్వాత స్ట్రీమింగ్‌కు వరలక్ష్మీ 'శబరి'.. కానీ ఆ ఓటీటీలో
ABN , Publish Date - Oct 08 , 2024 | 12:26 PM
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమా ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. ఎట్టకేలకు అన్ని అవరోధాలను దాటుకొని ఐదు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Vara lakshmi sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి' (Sabari). ఎట్టకేలకు అన్ని అవరోధాలను దాటుకొని ఐదు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ వంటి దర్శకుల వద్ద పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ (Anil katz) ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. శశాంక్, గణేశ్ వెంకట్రామన్, మైమ్ గోపి, బధునందన్ కీలక పాత్రల్లో నటించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు.
కథ విషయానికి వస్తే.. సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) అరవింద్ (గణేశ్ వెంకట్రామన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్లకు అతను మోసం చేయడంతో సంజన తన కూతురు రియా (నివేక్ష)ను తీసుకొని ముంబయి నుంచి వైజాగ్‌కు వచ్చేస్తుంది. తన కాలేజీ మిత్రుడు, అడ్వకేట్ రాహుల్ (శశాంక్)ను సాయంతో ఓ కంపెనీలో జుంబా ట్రైనర్‌గా చేరి జీవితం వెళ్లదీస్తుంటుంది. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో సడెన్‌గా సూర్యం (మైమ్ గోపి) అనే సైకో రియా నా బిడ్డని.. తనకు అప్పగించాలంటూ సంజన వెంటపడతాడు. మరోవైపు అరవింద్ కూడా తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతాడు.
మరి ఈ క్రమంలో ఏమైంది?కూతుర్ని కాపాడుకునేందుకు సంజన ఏం చేసింది? రియా నిజంగా తన కూతురేనా? సైకో సూర్యం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి, అతనికి అరవింద్‌తో సంబంధం ఏంటి అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి చేసిన పోరాటం ఇతివృత్తంగా ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ దసరా సందర్భంగా ఆక్టోబర్ 11 (శుక్రవారం) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. సో..థియేటర్లలో మిస్సయిన వారు ఇక ఇంట్లోనే టీవీలోనే చూసేయవచ్చు. మే 3న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకునప్పటికీ ఓటీటీకి రావడానికి ఇన్నాళ్లు పట్టింది.