Maharaja OTT: ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న.. విజయ్ సేతుపతి లేటెస్ట్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:00 PM
ఇటీవల థియేటర్లలోకి వచ్చి తమిళనాట రికార్డులు తిరగరాస్తున్న విజయ్ సేతుపతి లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ మహారాజా. అనుకున్న డేట్‌కు కాకుండా ఇంకా ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లేటెస్ట్ తమిళ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ మహారాజా (Maharaja) సిద్దం అవుతోంది. మొదటగా అనుకున్న సమయానికి కాకుండా వారం రోజులు ముందుగానే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, .హిందీ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. రూ.20 కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.110 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
కథ విషయానికి వస్తే.. మహారాజా ఓ బార్బర్ తన పనేదో తను చూసుకుంటూ కూతురితో కలిసి సంతోష్గి ఉంటుండు. అయితే ఓ రోజు తను ఎంతో ఇష్టంగా చూసుకునే లక్ష్మి అనే డస్ట్ బిన్‌ను ఎవరో దొంగలించారని వెతికి పెట్టాలంటూ పోలీస్ స్టేషన్‌కు వెళతాడు. అక్కడ వారు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు.
పై అధికారులకు డబ్బులు ఇస్తాననడంతో అధికారులు రంగంలోకి దిగుతారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ షాప్ నిర్వహించుకునే సెల్వం స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఇలా సినిమాలో రెండు కథలు నడుస్తూ ప్రేక్షకులకు ముందు సమ్‌థింగ్ ఏదో పెద్దగానే జరగబోతుందనే విషయాన్ని చివరి వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చో బెట్టేలా చేస్తుంది.
అసలు మహారాజాకు సెల్వంకు మధ్య ఏమైనా సంబంధం ఉందా, పోలీసులు లక్ష్మిని వెతికి తేగలిగారా, దాని వెనకాల ఇంకేమెనా రహాస్యాన్ని కనిపెట్టారా అనే ఇంట్రెస్టింగ్ కథకథనాలతో ఫస్టాప్ అంతా కామెడీగా సాగుతుంది. ఇంటర్వెల్ మంచి కథ టర్న్ తీసుకుని సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కోక్క చిక్కును విప్పుకుంటూ ఎక్కడా థ్రిల్ మిస్సవకుండా,వల్గారిటీ, అససభ్యకర సన్నివేశాలు లేకుండా సస్పెన్స్‌ను కంటిన్యూ చేశారు. ఇక ఫ్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులతో మైండ్ బ్లాక్ అవడం మాత్రం ఖాయం.
అయితే ఈ మహారాజా (Maharaja) సినిమాను ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌కు వస్తున్నట్లు వార్తలు బాగా ప్రచారం జరిగాయి. కానీ సదరు ఓటీటీ నిర్వాహాకులు వారం ముందుగానే అంటే మరో మూడు, నాలుగు రోజుల్లోనే (జూలై 12) నుంచి తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తునారు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటిస్తూ తమ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది.
అరుదుగా వచ్చే ఇలాంటి థ్రిల్లర్ సినిమాను ఇప్పటికే థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో మాత్రం మిస్ చేయకండి. నిథిలన్ స్వామినాథన్ (Nithilan Swaminathan) ఈ సినిమాకు రచన, దర్శకత్వం చేయగా మమతా మోహన్ దాస్ (Mamta Mohandas), అభిరామి (Abhirami), బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap), నటరాజన్ సుబ్రహ్మణ్యం (Natarajan Subramaniam) ప్రధాన పాత్రల్లో నటించారు.