Biggboss8: గౌతమ్, నిఖిల్ మ‌ధ్య‌లో య‌ష్మీ.. బిగ్‌బాస్ అస‌లెటు వెళుతుందిరా

ABN , Publish Date - Nov 06 , 2024 | 08:35 AM

ఇటీవ‌లే 60 రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జీన్‌8 వ‌డివ‌డిగా సాగుతోంది. నిత్యం రీతొక్క గేమ్‌తో కంటెస్టెంట్ల గొడ‌వ‌ల‌తో నేనంటే నేను అన్న చందాన ముందుకు ప‌రుగులు పెడుతోంది.

biggboss

ఇటీవ‌లే 60 రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జీన్‌8 వ‌డివ‌డిగా సాగుతోంది. నిత్యం రీతొక్క గేమ్‌తో కంటెస్టెంట్ల గొడ‌వ‌ల‌తో నేనంటే నేను అన్న చందాన ముందుకు ప‌రుగులు పెడుతోంది. తాజాగా నామినేష‌న్ ఎపిసోడ్ ముగియ‌డంతో కంటెస్టెంట్లంతా తిరిగి వారి లోకానికి వ‌చ్చి చ‌ర్చా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి జ‌రిగిన డ్యామేజీకి పూత‌లు పూయ‌డం వంటి కార్య‌క్ర‌మాలు చేశారు. మ‌రి కొంత‌మంది త‌మలోని అవేశాన్ని ఆపుకోలేక ఇత‌రుల‌పై ఫైర్ అయ్యారు. ఇర గౌత‌మ్, య‌శ్మీ, నిఖిల్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న క‌థ‌ సినిమా ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీల‌ను త‌ల‌పించేలా ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

GbhZp10a8AAH4Mq.jpeg

తాజా ఎపిసోడ్‌లో నామినేషన్స్ ముగిశాక‌ బాత్రూం ముందు యష్మీని హగ్ చేసుకుంటూ నిఖిల్ ఓ మాట అడిగాడు. "ఎందుకు ఆ (గౌతమ్ అక్కా అన్నది) టాపిక్ తీశావురా వేస్ట్‌గా".. అంటూ నిఖిల్ అడిగాడు. దీనికి తీయాలిరా మీరిద్దరూ ఎంత సేపు మాట్లాడారు అక్కా అనే టాపిక్ మీద.. అది బ్యాడ్‌గా వెళ్తుంది బయటికి.. నువ్వు అక్కా అన్నదే మెయిన్ నామినేషన్ పాయింట్‌గా తీసినప్పుడు.. ఎవరికైనా నిఖిల్ ఎందుకు ఆ పాయింట్ మీద చేశాడు అనే చర్చ వస్తుంది.. ఖచ్చితంగా వస్తుంది.. అంటూ యష్మీ ఆన్సర్ ఇచ్చింది.

"రేయ్ స్వాతిముత్యం మీకు అర్థం కావట్లే.. అక్కడే ఏదైతే చెప్తున్నారో బయట కూడా అదే పోట్రే అవుతుంది.. మీకు అర్థం కావట్లే.." అంటూ యష్మీ-నిఖిల్‌ల‌కు గౌతమ్సలహా ఇచ్చాడు. దీనికి మా గురించి ఏమీ బ్యాడ్‌గా చెప్పలేదురా వాళ్లు.. నువ్వు నీ గురించి చెప్పడం చాలా రాంగ్‌గా తీసుకుంటున్నావ్.. పాజిటివ్‌గా ఆలోచించు.. అంటూ గౌతమ్‌తో చెప్పింది యష్మీ. ఇక దీనికి సీరియస్ అయిన నిఖిల్ "జనాలు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారని ఒకవేళ ఎవరికైనా థాట్ ఉంటే ఒకరితో కూడా మాట్లాడకూడదు నన్ను అడిగితే.. అనుకునే వాళ్లు వంద అనుకుంటారు.. వాటన్నింటికీ వివ‌ర‌ణ‌ ఇచ్చి బతకడానికి అయితే రాలేదు ఎవరూ ఇక్కడ.." అంటూ చెప్పి వెళ్లిపోయాడు.


GbhZp16aYAAyvhW.jpeg

ఇక వెంట‌నే విష్ణుప్రియ దగ్గరికెళ్లి వెళ్లిన‌ నిఖిల్. "ఇప్పుడు యష్మీది- గౌతమ్‌ది నామినేషన్ అయిందా లేక వాళ్ల ఫీలింగ్‌లో వాదించుకున్నారా.. నాకు అయితే నామినేష్ అనిపించలేదు. నేను ఆ మధ్యలో ఉండటం.. అంటే ఆ ట్రైయాంగిల్ నన్ను ఎఫెక్ట్ చేస్తుంది.. కదా.. నేను అక్కడ నిల్చొని మాట్లాడాల్సిందా లేక తప్పయిందా.." అంటూ నిఖిల్ అడిగాడు. దీనికి "మాట్లాడకపోయినా ఏమయ్యేది కాదు.. ఎందుకంటే నువ్వు ఎప్పటికప్పుడు తనకి (యష్మీ) క్లారిటీ ఇస్తున్నావ్ కదా.." అంటూ విష్ణు ప్రియ చెప్పింది. నేను అదే అంటున్నా వీడు (గౌతమ్) అస్తమానం ట్రయాంగిల్ నిఖిల్.. మూడో వాడు ఉన్నాడు ఉన్నాడు అనేసరికి అది రాంగ్‌గా వెళ్తుంది.. నేను ఓ క్లారిటీ ఇవ్వాల్సింది.. జనాలికి కూడా తెలిసేదేంటంటే నాకు కావాల్సిన వాళ్లు బయట ఉన్నారని.." అంటూ నిఖిల్ అన్నాడు.

అయితే ఒక‌సారేమో బయటి జనాలు ఏమనుకుంటే మనకేంటి అని.. మ‌రోసారేమో జనాలు నా గురించి ఏమనుకుంటురు.. నాకది ఎఫెక్ట్ అవుతుంది అంటూ చెప్పే మాట‌ల‌కు, చేసే ప‌నుల‌కు సంబంధం లేకుండా నిఖిల్‌ త‌న‌లోని రెండు మ‌న‌స్త‌త్వాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం కొస‌మెరుపు. దీంతో అసలు ఈ ముగ్గురిలో ఎవరు ఎవరివైపు మాట్లాడుతున్నారో.. ఏం మాట్లాడుతున్నారో.. వీరి మధ్య ఏం జరుగుతుందో బిగ్‌బాస్ త‌మ‌కు అవ‌స‌ర‌మైన ఫీడింగ్ మాత్ర‌మే ఎడిట్ చేసి వ‌దులుతుండ‌డంతో చూసే ప్రేక్షకులకు అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు.

Updated Date - Nov 06 , 2024 | 08:35 AM