యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం (జూన్ 10)న చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో ఇటీవల ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి పెళ్లిని కూడా ఇరు కుటుంబ సభ్యులు గ్రాండ్గా నిర్వహించారు.