టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడు కుమారుడు అయిన ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల వివాహం రీసెంట్గా జైపూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖులెందరో హాజరయ్యారు. శుక్రవారం వీరి వివాహానికి సంబంధించి గ్రాండ్ రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులెందరో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.