Dreamcatcher: పాటలు, ఫైట్స్‌లేని ‘డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్ ఇవే..

ABN, Publish Date - Dec 27 , 2024 | 10:37 PM

Dreamcatcher: పాటలు, ఫైట్స్‌లేని ‘డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్ ఇవే.. 1/6

ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

Dreamcatcher: పాటలు, ఫైట్స్‌లేని ‘డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్ ఇవే.. 2/6

డీవోపీ ప్రణీత్ గౌతమ్ నందా మాట్లాడుతూ ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సందీప్ కు థ్యాంక్స్. ట్రైలర్ చూశారు కదా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. జనవరి 3న మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.

Dreamcatcher: పాటలు, ఫైట్స్‌లేని ‘డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్ ఇవే.. 3/6

డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ.. సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. ఇన్ సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఇన్సిపిరేషన్‌గా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నాను.

Dreamcatcher: పాటలు, ఫైట్స్‌లేని ‘డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్ ఇవే.. 4/6

మనకున్న రిసోర్సెస్‌లో మొత్తం హైదరాబాద్‌లోనే సినిమా రూపొందించాను. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. మేము ఎక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే షూట్ చేశాం. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను.

Dreamcatcher: పాటలు, ఫైట్స్‌లేని ‘డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్ ఇవే.. 5/6

గంటన్నర నిడివితో సినిమా ఉంటుంది. పాటలు, ఫైట్స్ ఉండవు. అవి లేకుండా కేవలం కథ మీదనే మూవీ వెళ్తుంది. ఇది థియేటర్, ఓటీటీకి వెళ్తుందా అని అనుకోలేదు. ఒక మంచి మూవీ చేస్తే ఎక్కడైనా ఆదరిస్తారని నమ్మాను. నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేసింది.

Dreamcatcher: పాటలు, ఫైట్స్‌లేని ‘డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్ ఇవే.. 6/6

రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్‌లో ప్రమోషన్ చేస్తున్నాం. మాకున్న టైమ్ లో సినిమాను ఆడియెన్ కు రీచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. జనవరి 3న ‘డ్రీమ్ క్యాచర్’సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండని అన్నారు.

Updated at - Dec 27 , 2024 | 10:37 PM