పుష్కర కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అంతగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన కథానాయిక సిద్ధికా శర్మ. అందానికి అందం, నటన, మంచి గ్లామర్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక ఈ ముద్దుగుమ్మ సినిమా అవకాశాలు పొందలేకపోయింది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం ఫొటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.