AR Rahman: జాతీయ పురస్కారం వారికే అంకితం
ABN , Publish Date - Aug 18 , 2024 | 01:55 PM
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో (70th National Film Awards) ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ కు కూడా పురస్కారం వరించింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో (70th National Film Awards) ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ కు కూడా పురస్కారం వరించింది. ‘పొన్నియిన్ సెల్వన్ 1’(Ponniyin Selvan: I) కుగానూ ఆయన జాతీయ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా రెహమాన్‌తో ఓ ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడారు. నేషనల్ అవార్డుకు మరోసారి ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని సౌండ్ ఇంజినీర్స్, మ్యూజిషియన్స్, సింగర్స్ తదితర తన బృందానికి అంకితమిస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నంతో ఉన్న అనుబంధాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కాంబోలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’కుగానూ ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో రెహమాన్ పురస్కారానికి (AR Rahman)ఎంపికయ్యారు. ఈ కాంబినేషన్లో 1992లో వచ్చిన ‘రోజా’ చిత్రానికిగానూ రెహమాన్‌ను జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం రెండు భాగాలుగా సినిమా తెరకెక్కించారు. 2022లో విడుదలైన ఈ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతంతో పాటు మరో మూడు విభాగాల్లో అవార్డులు రావడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం), ఉత్తమ సినిమాటోగ్రఫీ (రవి వర్మన్), ఉత్తమ సౌండ్ డిజైన్ (ఆనంద్ కృష్ణమూర్తి) కేటగిరీల్లో సత్తా చాటింది.