Raghava Lawrence: విజ‌య్‌కాంత్ కుమారుడి సినిమా నుంచి తప్పుకున్న లారెన్స్‌?

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:47 PM

దివంగత సీనియర్‌ నటుడు విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండ్యన్ హీరోగా ‘పడైతలైవన్‌’ పేరుతో అన్బు దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతుంది. ఇందులో దర్శక నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్ అతిథి పాత్ర పోషించనున్నట్టు మొదట ప్రకటించారు. కానీ ఇప్పుడీ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

raghava

దివంగత సీనియర్‌ నటుడు విజయకాంత్ (Vijayakanth) కుమారుడు షణ్ముగ పాండ్యన్ (Shanmuga Pandian) హీరోగా ‘పడైతలైవన్‌’ (Padaithalaivan)పేరుతో అన్బు (Anbu) దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతుంది. ఇందులో దర్శక నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్ (Raghava Lawrence) అతిథి పాత్ర పోషించనున్నట్టు మొదట ప్రకటించారు.

F4XKnI5WAAAastN.jpeg

కానీ, ఇపుడు ఈ సినిమా నుంచి లారెన్స్‌ (Raghava Lawrence) తప్పుకున్నారు. దీనిపై చిత్ర దర్శకుడు ఆన్బు వివరణ ఇచ్చారు. ‘షణ్ముగ పాండ్యన్‌ సినీ కెరీర్‌కు సాయ పడేందుకు ఆయన కొత్త చిత్రంలో నటించేందుకు లారెన్స్‌ ముందుకు వచ్చారు. దీంతో నేను, షణ్ముగ పాండ్యన్ (Shanmuga Pandian) స్వయంగా లారెన్స్ (Raghava Lawrence)ను కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పాం. ఆ తర్వాత సినిమాలో ఆయన పాత్ర డిజైన్‌ చేశాం. కానీ, ఆయన పాత్ర ఈ సినిమాకు బలంగా ఉంటుందా? అనే సందేహం కలిగింది. వెంటనే లారెన్స్‌ను కలిసి వివరించగా, ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.


images.jpeg

అదేసమయంలో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. అంతేకానీ, రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) ఈ ప్రాజెక్టు నుంచి అర్థాంతరంగా తప్పుకోలేదు’ అని దర్శకుడు అన్బు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 12:47 PM