నాకంటూ ఎవరూ లేరు.. అనుకునే వారికి ఈ సినిమా మంచి సందేశం

ABN , Publish Date - Sep 15 , 2024 | 10:25 AM

జీవితం నన్ను వదిలివేసింది. నాకంటూ ఎవరూ లేరు అని భావించే వారికి ఈ సినిమామంచి సందేశగా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు శీను రామస్వామి అన్నారు.

నిర్మాత తనను నమ్మి పెట్టుబడిపెట్టినప్పటికీ... దాన్ని పొదుపుగా ఖర్చు చేసే దర్శకుల్లో శీను రామస్వామి (Seenu Ramasamy) ఒకరని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు. విజన్‌ హౌస్‌ పతాకంపై డాక్టర్‌ పి.అరుళానందం, మ్యాథ్యూ అరుళానందం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కోళిపన్నై చెల్లదురై’ (Kozhi Pannai Chelladurai). శీను రామస్వామి దర్శకత్వంలో ఏగన్ (Aegan), బ్రిగిడ (Brigida saga) హీరో హీరోయిన్లుగా యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో సత్యదేవి, భవ చెల్లదురై, లియో శివకుమార్‌, కుట్టిపులి దినేష్‌, మానస్వి, రియాజ్‌ తదితరులు నటించారు. ఈ నెల 20వ తేదీన శక్తి ఫిలిమ్‌ ఫ్యాక్టరీ విడుదల చేయనుంది. ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో రిలీజ్‌ చేశారు.

GXQmmIQXUAA52JR.jpeg

ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) మాట్లాడుతూ.. ‘శీను రామస్వామి దర్శకత్వంలో నాలుగు చిత్రాల్లో నటించాను. ఆయన కథ చెప్పేటపుడు గాని సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో ఎపుడు కూడా తడబడటం చూడలేదు. తనను నమ్మి పెట్టుబడి పెట్టే నిర్మాతను ఏదో రూపంలో ఆదుకునేలా పొదుపుగా ఖర్చు చేసి చిత్రాన్ని పూర్తి చేసే దర్శకుడు. అలాంటి దర్శకుడి ద్వారా హీరోగా ఏగన్‌ పరిచయం కావడం అతడి అదృష్టం అన్నారు. నటుడు యోగిబాబు (Yogi Babu) మాట్లాడుతూ, ‘నా పుట్టిన రోజున ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. అనుకున్నట్టుగానే నిర్మాణం పూర్తి చేశాం. నిర్మాతకు ధన్యవాదాలు. జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామితో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో ఒక మంచి పాత్ర ఇచ్చారు. సాధారణంగా ప్రతి చిత్రంలో నేను కౌంటర్‌ ఇస్తుంటాను. కానీ, ఇందులో అలాంటి అవకాశం లేకుండా పోయిందన్నారు.


GXMzGkWWEAA38c8.jpeg

దర్శకుడు శీను రామస్వామి (Seenu Ramasamy) మాట్లాడుతూ, ‘నిర్మాతల్లో ఒకరైన మ్యాథ్యూ చిన్న వయసులోనే ఎంతో బాధ్యత, కర్తవ్యం, అంకి తభావంతో పనిచేసే యువకుడు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని పయనిస్తున్నాడు. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలో ఒక మంచి సబ్జెక్టును చెప్పాను. జీవితం నన్ను వదిలివేసింది. ఈ జీవితాన్ని గడపటం ఏమాత్రం ఇష్టం లేదు. ఈ జీవితంలో నాకంటూ ఎవరూ లేరు అని భావించే వారికి ఒక మంచి సందేశ సినిమాగా ఉంటుంది. ఈ విశ్వం ఏ వ్యక్తినీ వదిలిపెట్టదు. ఏదో ఒక రూపంలో వచ్చి అక్కున చేరుకుంటుంది’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ఎన్‌ఆర్‌ రఘునందన్‌, హీరో ఏగన్‌, హీరోయిన్‌ బ్రిగిడ తదితరులు ప్రసంగించారు.

Updated Date - Sep 15 , 2024 | 10:25 AM