Thangalaan: ‘తంగలాన్‌’ అవార్డుల సినిమా కాదు

ABN , Publish Date - Aug 19 , 2024 | 08:08 AM

‘తంగలాన్‌’ చిత్రం అవార్డుల కోసం తీసిన సినిమా కాదని ఆ చిత్ర హీరో చియాన్‌ విక్రమ్ అన్నారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..

pa ranjith

పా.రంజిత్ (Pa Ranjith)దర్శకత్వంలో రూపుదిద్దుకుని స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఐదు భాషల్లో పాన్‌ ఇండియా మూవీ గా విడుదలైన ‘తంగలాన్‌’ (Thangalaan) చిత్రం అవార్డుల కోసం తీసిన సినిమా కాదని ఆ చిత్ర హీరో చియాన్‌ విక్రమ్ (Chiyaan Vikram) అన్నారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలైనప్పటి నుంచి సినిమా విడుదలకు ముందు రోజు వరకు మీడియా నుంచి తాము ఊహించని విధంగా ఆదరణ లభించింది.

Thangalaan-3.jpg

భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటించారు. అదొక ప్రపంచం. దాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ప్రేక్షలను దృష్టిలో ఉంచుకుని తంగలాన్ (Thangalaan) రూపొందించాం. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించి అవార్డులు గెలుచుకోవాలన్న ఉద్దేశ్యంతో కాకుండా, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ, నిర్మాతకు లాభాల వర్షం కురిపించాలని భావించి, ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించామ‌న్నారు.


GA1MgzHbEAAdvwI.jpeg

ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారు. అయితే, ఇది సమష్టి కృషి. నా వరకు ఇది మరోస్థాయి సినిమా’ అని పేర్కొన్నారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ ఙ్ఞానవేల్‌ రాజా భారీ బడ్జెట్‌తో నిర్మించగా, జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.55 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Updated Date - Aug 19 , 2024 | 08:08 AM