Kasturi: ఎక్కడికీ పారిపోలేదు.. వీడియో వైరల్‌

ABN , Publish Date - Nov 18 , 2024 | 10:38 AM

తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను నటి కస్తూరి స్పందించారు. షూటింగ్‌ కోసమే హైదరాబాద్‌ వచ్చానని షూటింగ్‌ ముగిసిన వెంటనే పోలీసులకు సహకరించానని తెలిపారు.

తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను నటి కస్తూరి (Kasthuri) స్పందించారు. షూటింగ్‌ కోసమే హైదరాబాద్‌ వచ్చానని షూటింగ్‌ ముగిసిన వెంటనే పోలీసులకు సహకరించానని తెలిపారు. ఎగ్మోర్‌ పోలీసులకు (Actress Kasturi Case)పూర్తిగా సహకరించాననీ, తనకు ఎలాంటి భయం లేదని కస్తూరి చెప్పారు.  అసలు విషయం ఏంటంటే.. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని తమిళనాడు పోలీసులు శనివారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కొన్నిరోజులు పరారీలో ఉన్న ఆమెను పుప్పాలగూడలోని ఓ అపార్టుమెంట్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఆమె ఓ వీడియో రిలీజ్‌ చేశారు. అరెస్టుకు ముందు ఆమె ఈ వీడియో రికార్డు చేశారు.  తాను ఎక్కడికీ పారిపోలేదని, షూటింగ్‌ కోసమే హైదరాబాద్‌ వచ్చానని షూటింగ్‌ ముగిసిన వెంటనే పోలీసులకు సహకరించానని తెలిపారు. (Tollywood Actress)

తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా గుర్తింపు పొందిన కస్తూరి శంకర్‌ నవంబరు 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో పాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ కస్తూరి మదురై కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత నుంచి ఆమె పరారీలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించారు. చివరగా హైదరాబాద్‌ శివారు పుప్పాలగూడలో ఉన్నట్లు గుర్తించారు. ఎగ్మూరు పోలీసులు బృందం శనివారం మధ్యాహ్నం కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం అనుమతితో చెన్నైకి తరలించారు.


Updated Date - Nov 18 , 2024 | 11:58 AM