Rambha: ఆయనలో ఎలాంటి మార్పులేదు.. మంచి పాత్ర వస్తే మళ్ళీ నటిస్తా!
ABN , Publish Date - Jul 26 , 2024 | 04:11 PM
తనకు మంచి పాత్ర లభిస్తే మళ్ళీ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీనియర్ నటి రంభ ప్రకటించారు. ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె ఓ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తనకు మంచి పాత్ర లభిస్తే మళ్ళీ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీనియర్ నటి రంభ (Rambha) ప్రకటించారు. ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె ఓ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సినిమాల్లో నటించి పాతికేళ్ళు గడిచిపోయాయి. అనేక మంది హీరోలతో కలిసి నటించాను. అందువల్ల ఇకపై ఫలానా హీరో చిత్రంలో నటించాలన్న ఆశ లేదు. మంచి కథ, పాత్ర వస్తే మాత్ర ఖచ్చితంగా మళ్ళీ నటిస్తానని స్పష్టం చేసింది.
హీరో విజయ్ (Thalapathy vijay) రాజకీయాల్లోకి రావడం అనేది ఒక సాహసంతో కూడుకున్నది. ఆయనతో కలిసి ‘నినైత్తేన్ వందాయ్’ వంటి ఒకటి రెండు చిత్రాల్లో నటించాను. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పులేదు. కాకపోతే, అపుడు మౌనంగా ఉండేవారు. ఇపుడు కాస్త జాలీగా మాట్లాడుతున్నారు’ అని అన్నారు. కాగా, ఇటీవల చెన్నై వచ్చిన ఆమె హీరో విజయ్ను తన పిల్లలతో కలిసి ఫొటోలు దిగిన విషయం తెల్సిందే.