Amala Paul: మాతృత్వం.. ఆనందానికి అవధుల్లేవ్‌!

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:42 AM

హీరోయిన్  అమలాపాల్‌ తల్లి అయింది. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమలా సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ నెల 11న ఆమె ప్రసవించింది.

Amala Paul:  మాతృత్వం.. ఆనందానికి అవధుల్లేవ్‌!


హీరోయిన్  అమలాపాల్‌ (Amala paul) తల్లి అయింది. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమలా సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ నెల 11న ఆమె ప్రసవించింది. వారం తర్వాత ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆస్పత్రి నుంచి బిడ్డను (Blessed with Baby boy) ఇంటికి తీసుకెళుతున్న వీడియో క్లిప్‌ను ఇన్‌ స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చే సమయానికి ఉయ్యాలతో సహా రూమ్‌ అంతా డెకరేట్‌ చేసి ఉంచారు తన భర్త. ఈ వీడియో చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అమలాపాల్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  బిడ్డ రాకతో అమలాపాల్‌ ఆనందానికి అవధుల్లేవు.

amala-paul.jpg
గతేడాది గుజరాత్‌కు చెందిన జగత్‌ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది అమలాపాల్‌. కొన్నినెలల క్రితం తమ జీవితంలో మరో కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టింది. అప్పటి నుంచి తన బేబీ బంప్‌ ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వస్తోంది ఇటీవల సీమంతం కూడా జరిగింది. 

Updated Date - Jun 18 , 2024 | 11:44 AM