Bharateeyudu 2: ‘భారతీయుడు 2’ నుంచి.. ‘క్యాలెండర్’ లిరికల్ సాంగ్ రిలీజ్
ABN , Publish Date - Jul 01 , 2024 | 09:56 PM
కమల్ హాసన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. తాజాగా సోమవారం ఈ సినిమా నుంచి లిరికల్ క్యాలెండర్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ( Shankar) కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions), రెడ్ జెయింట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’(Bharateeyudu). ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఆ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలల్లో వేగం పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైటర్, పాటలు ఒకదాన్ని మించి మరోటి యమంచి స్పందనను తీసుకు రాగా సినిమాపై అంచనాలను రెట్టింపు కూడా చేశాయి.
ఈ క్రమంలో తాజాగా సోమవారం ఈ సినిమా నుంచి ‘పాలపుంతల్లో వాలి- జంట మేఘాల్లో తేలి.. భూమితో పని లేకుండా- గడిపేద్దామా! వెన్నెల మాటలు కొన్ని- చుక్కల ముద్దులు కొన్ని దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా!..’ అంటూ సాగే లిరికల్ క్యాలెండర్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలోని విజువల్స్ మెస్మరైజ్ చేస్తుండగా శంకర్ సినిమాల్లోని గ్రాండియర్‌ను మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా ఉన్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీత సారథ్యం వహించగా క్యాలెండర్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్‌ను చంద్రబోస్ రాయగా శ్రావణ భార్గవి ఆలపించారు. ప్రముఖ దక్షిణాఫ్రికా మోడల్, 2017లో మిస్ యూనివర్స్ విజేత డెమి-లీ టెబో (Demi-Leigh Tebow) ఈ పాటలో నటించటం విశేషం.
ఇక శంకర్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన స్టైల్లో పాటలోని ప్రతి సన్నివేశాన్ని గ్లామర్‌గానే కాదు.. వావ్ అనిపించేంత గొప్పగా చిత్రీకరించారని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ పాటను సిల్వర్ స్క్రీన్‌పై చూస్తే ఆ ఫీల్ మరోలా ఉంటుందనటంలో సందేహం లేదు. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి.
28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది. సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారోనంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు సహా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేశారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందించారు.