Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్.. మానసిక స్థితిని పరీక్షించండి! హైకోర్టులో కేసు
ABN , Publish Date - Jan 04 , 2024 | 04:32 PM
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో చేరిన లేటెస్ట్ సెన్షేషన్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). తాజాగా లోకేశ్‌పై లియో సినిమా విషయంలో తమిళనాట ఓ కేసు బుక్కైంది.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో చేరిన లేటెస్ట్ సెన్షేషన్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). చేసినివి నాలుగు సినిమాలే అయినప్పటికీ హీరోల స్థాయి స్టార్ డం అతని సొంతం. మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాల ద్వారా యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించడమే కాక ఎల్సీయూ(లోకేశ్ యూనివర్స్)లో చిత్రాలు ఉంటాయని ప్రకటించి తన సినిమాల రాక రోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేలా పేరు తెచ్చుకున్నాడు. అలాంటిది ఇప్పుడు లోకేశ్‌పై తమిళనాట ఓ కేసు బుక్కైంది.
2023 దసరాకు విడుదలైన లియో సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 కోట్ల వసూళ్లను కొళ్లగొట్టి సంచలనం సృష్టించింది. అంతేగాక ఇదే సినిమా విషయంలో త్రిషపై మన్సూర్ అలీఖాన్ అసంబద్ద వ్యాఖ్యలు చేయడం దేశమంతటా చర్చకు దారి తీసి కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే లియో సినిమా విషయంలో మదురైకి చెందిన రాజు మురుగన్ అనే ఓ వ్యక్తి లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) మానసిక పరిస్థితిని ఓ సారి పరీక్షించండి అంటూ హైకోర్టు మదురై బెంచ్‌లో ఫిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఇటీవల దళపతి విజయ్(Thalapathy Vijay), త్రిష, జంటగా లోకేశ్ దర్శకత్వంలో వచ్చిన లియో(Leo) సినిమా హింసను ప్రేరేపించేలా, ప్రోత్సహించేలా ఉన్నదన్నారు. సినిమాలో అయుధాల వాడకం అధికంగా ఉన్నదని, మత్తు పదార్థాల వాడకం, మతపరమైన సన్నివేశాలు, పిల్లలు, ఆడ వారిపై మితిమీరిన హింసా దృశ్యాలు వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల అంశాలను తన చిత్రాలలో ఎక్కువగా చిత్రీకరిస్తున్నారని ఈ క్రమంలో లోకేశ్ కనగరాజ్ మానసిక పరిస్థితిని గురించి పరీక్ష చేయించాలంటూ ఆరోపిస్తూ ఫిటిషన్ వేశారు.
లోకేష్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో ఇలాంటి సందేశమే ఉంటుందని, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా సమాజానికి చెడు సంకేతం ఇస్తున్నారన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు కృష్ణకుమార్, విజయకుమార్‌ల బెంచ్ ముందు విచారణకు రాగా, లోకేష్ కనకరాజ్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేశారు.